అంతర్జాతీయం

యుద్ధం వచ్చే పరిస్థితులు లేవు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూయార్క్, అక్టోబర్ 22: నియంత్రణ రేఖ వెంబడి ఉద్రిక్తతలు పెరిగిపోయినప్పటికీ భారత్, పాక్‌ల మధ్య ఇప్పటికిప్పుడు యుద్ధం జరిగే పరిస్థితులు ఉన్నాయని తాను భావించడం లేదని జమ్మూ, కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా అన్నారు. అంతేకాదు, కొన్ని టీవీ చానళ్లు కోరుకున్నదానికన్నా రెండు దేశాలు మరింత జాగ్రత్తగా వ్యవహరిస్తున్నాయని కూడా ఆయన అన్నారు. న్యూయార్క్ యూనివర్శిటీ విద్యార్థులు శుక్రవారం ఇక్కడ ‘్భరత్, పాకిస్తాన్: ఎ సబ్‌కాంటినెంటల్ అఫైర్’ అనే అంశంపై ఏర్పాటుచేసిన చర్చాగోష్ఠిలో ఒమర్ అబ్దుల్లా పాల్గొన్నారు. భారత్, పాక్‌లు యుద్ధం అంచుల్లో ఉన్నాయా అన్న ప్రశ్నకు ఆయన సమాధానమిస్తూ తాను అలా అనుకోవడం లేదని చెప్పారు. మన టీవీ చానళ్లు కొన్ని భావించిన దానికన్నా భారత్, పాక్ ప్రభుత్వాలు యుద్ధ ప్రమాదం విషయంలో మరింత జాగ్రత్తగా వ్యవహరిస్తున్నాయని ఆయన చెప్పారు. పాకిస్తాన్ మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్ కూడా ఈ సదస్సులో మాట్లాడాల్సి ఉండింది. అయితే చివరి నిమిషంలో భద్రతా కారణాలను చూపిస్తూ ఆయన ఈ కార్యక్రమాన్ని రద్దు చేసుకున్నారు. భారత్, పాక్ దేశాల విద్యార్థులు కూడా పాల్గొన్న ఈ చర్చాగోష్ఠిలో కాశ్మీర్‌పైన, భారత సైన్యం జరిపిన మెరపుదాడులు, హిజ్బుల్ ముజాహిద్దీన్ కమాండర్ బుర్హాన్ వనీ మృతి, భారత్-పాక్ ఉద్రిక్తతలు, కాశ్మీరీ పండిట్ల కష్టాలు, 370 అధికరణంలాంటి అంశాలపై విద్యార్థులు, ఒమర్ అబ్దుల్లాకు మధ్య వాడీవేడి చర్చ జరిగింది.