అంతర్జాతీయం

వారం రోజుల్లో పాక్ ఆర్మీ కొత్త చీఫ్ ఖరారు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇస్లామాబాద్, అక్టోబర్ 22: నవంబర్ నెలాఖరులో పదవీ విరమణ చేయనున్న పాక్ ఆర్మీ చీఫ్ జనరల్ రషీల్ షరీఫ్ స్థానంలో కొత్త ఆర్మీ చీఫ్‌ను ప్రభుత్వం వారం, పది రోజుల్లో నియమిస్తుందని పాక్ సీనియర్ మంత్రి ఒకరు చెప్పారు. కొత్త ఆర్మీ చీఫ్‌గా ఎవరిని నియమించాలనే దానిపై ప్రభుత్వం ఇంకా ఒక నిర్ణయం తీసుకోలేదు కానీ, వారం పది రోజుల్లో ఆయన పేరును ప్రకటిస్తుందని రాజధాని నగరాభివృద్ధి శాఖ మంత్రి తారిఖ్ ఫాజీ చౌదరి చెప్పారు. తనకన్నా ముందు ఆర్మీ చీఫ్‌గా ఉండిన అష్ఫక్ పర్వేజ్ కయానీలాగా రెండోసారి ఆర్మీ చీఫ్‌గా కొనసాగించాలని తాను కోరబోనని రహీల్ కొద్ది నెలల క్రితమే ప్రకటించిన విషయం తెలిసిందే. ఇంటా, బయటా భద్రతా పరంగా పెరిగిపోతున్న సవాళ్ల నేపథ్యంలో ఈ అంశంపై అనిశ్చితికి తెరదించడం కోసం రహీల్ వారసుడి పేరును ప్రకటించాలని నవాజ్ షరీఫ్ ప్రభుత్వంపై తీవ్ర ఒత్తిడి వస్తున్న విషయం తెలిసిందే. పాక్ చట్టాల ప్రకారం ఆర్మీ చీఫ్‌ను నియమించే అధికారం ప్రధానిదే అయిన నేపథ్యంలో తనకు నమ్మకస్తుడైన వ్యక్తినే ఆయన కొత్త ఆర్మీ చీఫ్‌గా నియమించే అవకాశాలు కనిపిస్తున్నాయి.