అంతర్జాతీయం

అరుణాచల్‌పై జోక్యం వద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బీజింగ్, అక్టోబర్ 24: భారత్‌తో తమకు ఉన్న సరిహద్దు సమస్య విషయంలో జోక్యం చేసుకోవద్దని అమెరికాను చైనా గట్టిగా హెచ్చరించింది. ఈ వ్యవహారంలో ఏ విధమైన ప్రమేయం కల్పించుకున్నా సమస్య మరింత సంక్లిష్టంగా మారుతుందని, సరిహద్దుల్లో ఇప్పటివరకూ కష్టపడి నెలకొల్పుకున్న శాంతియుత పరిస్థితులకూ విఘాతం కలుగుతుందని స్పష్టం చేసింది. తాము టిబెట్‌లో భాగంగా చెబుతున్న అరుణాచల్ ప్రదేశ్‌లో అమెరికా రాయబారి పర్యటించడంపై చైనా నిప్పులు చెరిగింది. అరుణాచల్‌లో అమెరికా రాయబారి పర్యటనను తాము ఎంత మాత్రం అంగీకరించడం లేదని సోమవారం ఇక్కడ జరిగిన మీడియా సమావేశంలో చైనా విదేశాంగ విభాగం లూ కంగ్ స్పష్టం చేశారు. అరుణాచల్‌ప్రదేశ్ ముఖ్యమంత్రి పేమా ఖందు ఆహ్వానం మేరకు అమెరికా రాయబారి రిచర్డ్ వర్మ శనివారం తవాంగ్ ప్రాంతాన్ని సందర్శించిన విషయం తెలిసిందే. అరుణాచల్‌లో ఏ ప్రాంతం పైనైతే భారత్-చైనాల మధ్య వివాదం చెలరేగుతోందో అదే ప్రాంతానికి అమెరికా రాయబారి వెళ్లడం సమర్థనీయమైన చర్య కాదు. ఈ సమస్యను సామరస్య పూర్వకంగా పరిష్కరించుకునేందుకు ఇరు దేశాలు ప్రయత్నిస్తున్న తరుణంలో అమెరికా ఈ చర్య సమంజసంగా లేదని అన్నారు.