అంతర్జాతీయం

పాఠశాలపై వైమానిక దాడి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అలెప్పో, అక్టోబర్ 27: సిరియాలో కొనసాగుతున్న యుద్ధంలో తాజాగా అమాయకులైన పిల్లలు అమానుషంగా హతమయ్యారు. నైరుతి సిరియాలోని ఓ పాఠశాలపై జరిగిన వైమానిక దాడిలో 26మంది మరణించగా అందులో కనీసం 20మంది అభంశుభం తెలియని పిల్లలే ఉండటం గమనార్హం. తిరుగుబాటుదారుల చేతుల్లో ఉన్న ఇడ్లిబ్ ప్రావిన్స్‌లోని ఓ పాఠశాలపై బుధవారం జరిగిన వైమానిక దాడుల్లో కనీసం 26మంది మరణించారు. వీరిలో ఎక్కువ మంది పిల్లలే ఉన్నారు. ఒక టీచర్ కూడా చనిపోయినట్లు తెలుస్తోంది. సిరియా యుద్ధ విమానాల దాడుల్లో పలువురు మిలిటెంట్లు కూడా చనిపోయినట్లు సిరియా టీవీ ప్రకటించింది. సిరియాకు నైరుతిలోని అలెప్పో నగరానికి దగ్గర్లో ఉన్న ఇడ్లిబ్ ఐసిస్ తిరుగుబాటు దారుల నియంత్రణలో ఉంది. రష్యా వాయుసేన చేపట్టిన మిలటరీ ఆపరేషన్‌లో ఈ ప్రాంతంలో భారీగా ప్రాణనష్టం వాటిల్లింది. తాజాగా సిరియా సైన్యం ఈ పట్టణాలను ఐసిస్ చేతుల్లోంచి స్వాధీనం చేసుకోవాలని ప్రయతినస్తోంది. బుధవారం నాటి దాడుల్లో మరణించిన వారిలో కనీసం 20 మంది పిల్లలే ఉన్నారని స్థానిక సివిల్ డిఫెన్స్ నెట్వర్క్ పేర్కొంది.