అంతర్జాతీయం

అబ్‌కీ బార్, ట్రంప్ సర్కార్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాషింగ్టన్, అక్టోబర్ 27:అమెరికా అధ్యక్ష పదవికి పోటీపడుతున్న రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ భారత ప్రధాని నరేంద్ర మోదీ బాట పడుతున్నారా? 2014 లోక్‌సభ ఎన్నికల్లో మోదీకి ఘన విజయం చేకూర్చిన ‘అబ్‌కి బార్..మోదీ సర్కార్’ నినాదమే ఇప్పుడు ట్రంప్‌కు ఇండో ఆమెరికన్ల ఓట్లకు ఏరగా మారింది! ‘అబ్‌కి బార్, ట్రంప్ సర్కార్’ అంటూ ఇండో అమెరికన్లను ఆయన ఆకర్షిస్తున్నారు. దాదాపు 30సెకన్ల పాటు ఉండే ఈ ప్రచార వీడియో 20చానళ్లలో ప్రసా రం అవుతోంది. మధ్యలో నరేంద్ర మోదీ బొమ్మ కూడా కనిపిస్తుంది. కాగా, అమెరికా అధ్యక్ష పదవికి పోటీ చేసిన ఏ అభ్యర్థి కూడా భారతీయుల ఓట్లను లక్ష్యంగా చేసుకుని ప్రత్యేకంగా ప్రకటనలు రూపొందించడం ఇప్పటి వరకూ జరుగలేదు. సంప్రదాయంగా డెమొక్రటిక్ పార్టీ వైపే మొగ్గు చూపే భారతీయ ఓటర్లను ఆకర్షించడమే ఈ ప్రకటనను రూపొందించడంలో ట్రంప్ ప్రధాన ఉద్దేశంగా కనిపిస్తోంది. రోజుకు 20సార్లు ఈ ప్రకటనను ప్రసారం చేస్తున్నామని ట్రంప్‌కు అనుకూలంగా పనిచేస్తున్న భారత్- అమెరికా సలహా మండలి చైర్మన్ సహలాబ్ కుమార్ తెలిపారు.