రాష్ట్రీయం

ఐరాస ప్రధాన కార్యదర్శి ఎంపికకు 800 ప్రశ్నలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూయార్క్, ఏప్రిల్ 18: ఐక్యరాజ్యసమితి ఏడు దశాబ్దాల చరిత్రలో ప్రధాన కార్యదర్శి పదవికి తొలిసారి కొత్త పద్ధతిలో ఎంపిక జరుగుతోంది. సమితి సెక్రటరీ జనరల్ పదవిని ఆశిస్తున్న అభ్యర్థులంతా సభ్యదేశాలు వేసిన కఠినమైన ప్రశ్నలకు ఇచ్చిన జవాబుల ఆధారంగా ఎంపిక చేస్తున్నారు. ప్రపంచ అత్యున్నత వ్యవస్థ అయిన ఐరాస చీఫ్ పదవికి భారత్‌సహా మొత్తం 9మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. వీరికి సమితి సభ్యదేశాలు మొత్తం 800 ప్రశ్నలు సంధించాయి. అభ్యర్థుల సామర్థ్యం, దూరదృష్టి, ప్రధాన కార్యదర్శి అయితే సదరు అభ్యర్థి చేపట్టే కార్యాచరణ ప్రణాళికపై వివిధ రకాల ప్రశ్నలకు అభ్యర్థులు జవాబులిచ్చారు. ఇదొక ‘గేమ్ చేంజింగ్’ విధానం అని సమితి అధ్యక్షుడు మోజెన్స్ లికెటాఫ్ సోమవారం అన్నారు. ప్రధాన కార్యదర్శి ఎంపికలో మరింత పారదర్శకతతో వ్యవహరించడానికి ఈ కొత్త విధానాన్ని ప్రవేశపెట్టినట్లు ఆయన వివరించారు. చివరగా అభ్యర్థి శక్తి సామర్థ్యాలే తుది ఎంపికను ప్రభావితం చేస్తాయన్నారు. ప్రతి అభ్యర్థికి రెండు గంటలపాటు టెలివిజన్, వెబ్‌కాస్ట్ టైమ్ స్లాట్‌లను కేటాయించారు. అభ్యర్థికి ప్రశ్నలు వేసే ముందు ప్రతి అభ్యర్థి తన దార్శనికతపై కొద్దిపాటి సమయం తనదైన ప్రజెంటేషన్ ఇచ్చారు. ఐక్యరాజ్యసమితి ఎదుర్కొంటున్న సవాళ్లు.. వాటి పరిష్కారాలపై వారికున్న అభిప్రాయాలను వెల్లడించారు. సమితిలోని మొత్తం 193 సభ్యదేశాలు అభ్యర్థులకు ప్రశ్నలు వేసే కార్యక్రమంలో పాల్గొన్నాయి. వీటి ఆధారంగా సమితి ప్రధాన కార్యదర్శి ఎంపికపై చర్చ జరుగుతుందని.. అనంతరం తుది ఎంపిక జరుగుతుందని మోజెన్స్ వివరించారు.