అంతర్జాతీయం

పశుపతినాథ్ ఆలయంలో రాష్టప్రతి ప్రత్యేక పూజలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖాట్మండు, నవంబర్ 3: రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీ నేపాల్‌లోని ప్రసిద్ధ పశుపతినాథ్ ఆలయంలో గురువారం ప్రత్యేక పూజలు చేశారు. బాగమతి నదీతీరంలో వేంచేసిన ఆలయం 5వ శతాబ్దానికి చెందింది. ఆలయానికి వచ్చిన రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీకి పశుపతి ఏరియా డెవలప్‌మెంట్ ట్రస్ట్ చీఫ్ గోవిందా టాండన్ తదితరులు ఘన స్వాగతం పలికారు. 108 మంది బతుక్ (హిందూ బాలురు) ‘స్వస్తిమంత్రాలు’, మంగళవాద్యాలు, బాజాభజంత్రీలతో తోడ్చొనివచ్చారు. ఆలయం తూర్పు ద్వారం వద్ద రాష్టప్రతికి ఘన స్వాగతం లభించింది. ప్రణబ్ రుద్రాభిషేకం, ప్రత్యేక పూజలు చేశారు. పాలు, పెరుగు, తేనె, పంచదార, నెయ్యితో శివలింగానికి అభిషేకం చేశారు. లక్ష దీపార్చన జరిగింది. ప్రసిద్ధ పశుపతినాథ్ ఆలయాన్ని యునెస్కో ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తించింది. ప్రపంచ నలుమూలల నుంచి వేలాది మంది హిందువులు ఏటా ఈ ఆలయాన్ని దర్శించుకుంటారు. రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీ సుమారు 45 నిముషాల సేపు ఆలయంలోనే గడిపారు. ప్రత్యేక పూజలు అయ్యేవరకూ ఆయన ఉన్నారు. ఆలయానికి 27వేల రూపాయల విరాళం అందచేశారు. హిందూ ప్రధాన పూజారి గణేశ్ భట్టా నేతృత్వంలో పలువురు పురోహితులు పూజాది కార్యక్రమాలు పర్యవేక్షించారు. అలాగే పశుపతినాథ్ ఆలయ ప్రాంగణంలో ఉన్న వాసుకి నాగ్ ఆలయంలో రాష్టప్రతి పాలాభిషేకం నిర్వహించారు. రాష్టప్రతి వెంట నేపాల్‌లో భారత రాయబారి రంజిత్ రే ఉన్నారు.

చిత్రం.. గురువారం నేపాల్‌లోని పశుపతినాథ్ ఆలయాన్ని సందర్శించిన రాష్టప్రతి ప్రణబ్