అంతర్జాతీయం

240 మంది దుర్మరణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రోమ్, నవంబర్ 3: మధ్యదరా సముద్రంలో వందలాది మంది శరణార్ధులతో వెళుతున్న రెండు రబ్బరు పడవలు మునిగిపోవడంతో 240మంది దుర్మరణం చెందినట్టుగా తెలుస్తోంది. ఈ రెండు నౌకల నుంచి కేవలం 31మంది మాత్రమే సురక్షితంగా బయట పడ్డారని ఐరాస శరణార్థ విభాగం గురువారం తెలిపింది. లిబియా నుంచి బయలు దేరిన కొన్ని గంటల వ్యవధిలోనే మొదటి రబ్బరు బోటు తలకిందులు కావడంతో 110మంది మరణించారు. మరో నౌక కూడా ప్రమాదానికి గురైందని, అందులో ప్రయాణిస్తున్న వారిలో 128మంది మరణించినట్టు ఐరాస ప్రతినిధి తెలిపారు. ప్రమాద సమయానికి లిబియా నౌకలో 140మంది ఉన్నారని, కేవలం 29మంది మాత్రమే సురక్షితంగా బయట పడ్డారని వెల్లడించారు.

చిత్రం.. మధ్యదరా సముద్రంలో రబ్బరు బోట్లలో ప్రయాణిస్తిన్న శరణార్ధులు