అంతర్జాతీయం

ట్రంప్ మద్దతుదారుడికి ఒబామా అండ!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఫాయెట్‌విల్లే (అమెరికా), నవంబర్ 5: అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా తన హుందాతనాన్ని మరోసారి చాటుకున్నారు. మంగళవారం జరుగనున్న అధ్యక్ష ఎన్నికల్లో హిల్లరీ క్లింటన్ విజయాన్ని కాంక్షిస్తూ డెమోక్రటిక్ పార్టీ శుక్రవారం ఇక్కడ ర్యాలీ నిర్వస్తున్నప్పుడు మిలటరీ యూనిఫారం ధరించిన ఒక వృద్ధుడు రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్‌కు మద్దతు తెలియజేస్తూ ప్లకార్డును చేతబట్టుకుని అక్కడ నిలబడ్డాడు. దీంతో ఆగ్రహించి ఆయనపై చేయి చేసుకునేందుకు ప్రయత్నించిన డెమోక్రటిక్ పార్టీ కార్యకర్తలను ఒబామా వారించి ఆ వ్యక్తిని కాపాడాడు. ‘ఆగండి.. అందరూ ప్రశాతంగా కూర్చోండి.. ఆయన ఎటువంటి తప్పూ చేయలేదు. తనకు ఇష్టమైన అభ్యర్థికి ఆయన మద్దతు తెలుపుతున్నాడు. కనుక ఆయనను ఏమీ చేయవద్దు. ఆయన గురించి మీరేమీ బాధపడవద్దు. మనమంతా భావ ప్రకటనా స్వేచ్ఛను గౌరవించే దేశంలో జీవిస్తున్నామన్న విషయాన్ని గుర్తుంచుకుని శాంతియుతంగా వ్యవహరించాలి. ఆ వ్యక్తి వృద్ధునిలా ఉన్నాడు. మిలటరీ దుస్తులు ధరించి ఉన్న ఆయన గతంలో మన సైనిక దళంలో పనిచేసి ఉండవచ్చు. కనుక మనమంతా ఆయనను తప్పకుండా గౌరవించి తీరాలి. అలాకాకుండా నిగ్రహాన్ని కోల్పోయి ఆగ్రహానికి గురైతే లేనిపోని సమస్యలను మనమే కొనితెచ్చుకున్నట్లవుతుంది. కనుక ఎవరూ అనవసరమైన విషయాల జోలికి పోకుండా శాంతియుతంగా వ్యవహరించాలి’ అని ఒబామా పేర్కొంటూ డెమోక్రటిక్ పార్టీ కార్యకర్తలకు హితబోధ చేశాడు. అయితే ఈ ర్యాలీ సందర్భంగా ఒబామా తన మద్దతుదారుడిపై ఆగ్రహం వ్యక్తం చేశారని శుక్రవారం రాత్రి హెర్షీ, పెన్సిల్వేనియాల్లో నిర్వహించిన ర్యాలీలో డొనాల్డ్ ట్రంప్ ఆరోపించారు.
హిల్లరీకి ఓటేయండి..
అమెరికా అధ్యక్ష ఎన్నికలు హోరాహోరీగా జరిగే అవకాశాలున్నాయని ఒబామా అంగీకరించారు. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని కీలక రాష్టమ్రైన నార్త్ కరోలినాలో ప్రతి ఒక్కరూ, ప్రత్యేకించి ఆఫ్రో-అమెరికన్లు హిల్లరీకి ఓటువేసి ఆమెకు విజయాన్ని చేకూర్చాలని ఒబామా తన మద్దతుదారులకు విజ్ఞప్తి చేశారు.

చిత్రం.. హిల్లరీ క్లింటన్ విజయాన్ని కాంక్షిస్తూ డెమోక్రటిక్ పార్టీ అమెరికాలోని
ఫాయెట్‌విల్లే రాష్ట్ర వర్శిటీలో నిర్వహించిన భారీ ర్యాలీలో పాల్గొన్న అధ్యక్షుడు ఒబామా