అంతర్జాతీయం

రక్షణ, భద్రత అంశాలకే ప్రాధాన్యత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లండన్, నవంబర్ 5: భరాత ప్రధాని నరేంద్ర మోదీ, బ్రిటీష్ ప్రధాని థెరెసా మే మధ్య సోమవారం జరిగే చర్చల్లో రక్షణ, భద్రతా సంబంధాలు ప్రధానాంశాలుగా ఉంటాయని, తమ చర్చల సందర్భంగా ఇరువురు నేతలు రెండుదేశాల మధ్య ఆర్థిక వాణిజ్య సంబంధాలు, కౌంటర్ టెర్రరిజంపై లోతుగా చర్చలు జరుపుతారని బ్రిటీష్ ప్రధాని అధికార ప్రతినిధి శనివారం రాత్రి ఇక్కడ డౌనింగ్ స్ట్రీట్ వద్ద విలేఖరులకు చెప్పారు. భారత్‌లో మూడు రోజుల పర్యటనకోసం థెరెసా మే ఆదివారం సాయంత్రం ఢిల్లీ చేరుకోనున్న విషయం తెలిసిందే. సోమవారం మధ్యాహ్నం హైదరాబాద్ హౌస్‌లో ప్రధాని మోదీతో ద్వైపాక్షిక సంబంధాలపై చర్చలు జరుపుతారు. పర్యటనలో ఎన్ని ఒప్పందాలపై సంతకాలు జరిగాయన్నది ముఖ్యం కాదని, ద్వైపాక్షిక సంబంధాలను ఎంతగా బలోపేతం చేసుకున్నాం, ఇరు దేశాల్లో కొత్తగా ఎన్ని ఉద్యోగాలు, వృద్ధి సాధించే దిశగా ఎంత ముందుకు వెళ్లామనేది ముఖ్యమని ఆ ప్రతినిధి అంటూ,మోదీతో జరిపే ద్వైపాక్షిక చర్చల్లో రక్షణ, భద్రత అంశాలు ప్రధానమైనవిగా ఉంటాయని తెలిపారు.
ఐరోపా యూనియన్‌లో కొనసాగాలా వద్దా అనే అంశంపై చారిత్రక రెఫరెండం తర్వాత డేవిడ్ కామెరాన్ వారసురాలిగా బాధ్యతలు చేపట్టిన థెరెసామే ఐరోపాకు ఆవల జరుపుతున్న తొలి పర్యటన కావడంతో ఈ పర్యటన ఎంతో ప్రాధాన్యత సంతరించుకుంది. థెరెసా వెంట 40 మంది చిన్న, మధ్య తరహా పారిశ్రామికుల ప్రతినిధుల బృందం కూడా వస్తోంది. సోమవారం ఉదయం థెరెసా మోదీతో కలిసి భారత్-బ్రిటన్ టెక్ సదస్సును ప్రారంభిస్తారు. ద్వైపాక్షిక చర్చల అనంతరం ఇరువురు నేతలు సంయుక్త ప్రకటన విడుదల చేస్తారు. మంగళవారం ఆమె బెంగళూరు వెళ్లి అక్కడ వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటారు.