అంతర్జాతీయం

క్లింటన్‌కే చాన్స్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూయార్క్, నవంబర్ 7: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో చివరి ఎన్నికల ముందస్తు సర్వేలోనూ డెమొక్రాటిక్ అభ్యర్థి హిల్లరీ క్లింటన్‌కే ఆధిక్యం లభించింది. మంగళవారం జరగనున్న ఎన్నికల్లో హిల్లరీకి గెలుపు అవకాశాలు 65శాతం ఉన్నట్లు ఓ వెబ్‌సైట్ నిర్వహించిన సర్వేలో తేలింది. ఈ ఎన్నికల్లో 81శాతం కంటే తక్కువగా ఓట్లు పోలవుతాయని, అందులో 65.3 శాతం హిల్లరీకి మొగ్గు చూపే అవకాశం ఉందని సర్వే పేర్కొంది. ప్రచారం ముగియటానికి కొద్ది గంటల ముందు ఇమెయిల్ వివాదానికి సంబంధించి హిల్లరీకి ఎఫ్‌బిఐ క్లీన్ చిట్ ఇవ్వటం ఆమెకు బాగా కలిసివచ్చింది. రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్‌కు 34.6శాతం మంది మాత్రమే మద్దతు పలుకుతున్నట్లు సర్వే పేర్కొంది. అధ్యక్ష పదవిని దక్కించుకోవటానికి మొత్తం 270 ఎలక్టోరల్ ఓట్లను ఒక అభ్యర్థి గెలుచుకోవలసి ఉంటుంది. ఈ ఎలక్టోరల్ ఓట్లలో హిల్లరీ 291.9, ట్రంప్ 245.3 ఓట్లను సాధిస్తారని ఈ సర్వేలో పేర్కొన్నారు. అంతేకాకుండా హిల్లరీకి 48.3శాతం ప్రజాదరణ లభిస్తున్నదని, ట్రంప్‌కు 45.4 శాతం మాత్రమే ఉందని ఈ సర్వేలో తేలింది. ఫైవ్‌థర్టీ ఎయిట్ అనే వెబ్‌సైట్ ఈ సర్వేను నిర్వహించింది. అయితే సర్వేలో హిల్లరీకి మొగ్గు చూపుతున్నప్పటికీ ట్రంప్‌కు ఉన్న ప్రజాదరణను తక్కువగా అంచనా వేయటానికి వీల్లేదని వెబ్‌సైట్ డైరెక్టర్ జేమ్స్ కామీ అన్నారు. అక్టోబర్ 28 నుంచి రిపబ్లికన్ అభ్యర్థి రెండు పాయింట్లు లాభపడ్డారని ఆయన అన్నారు.