అంతర్జాతీయం

లక్షిత దాడులు మేమూ చేస్తాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లాహోర్, నవంబర్ 7: భారత్‌పై తామూ సర్జికల్ దాడులకు దిగుతామని జమాతే ఉద్దవా చీఫ్, ముంబయిపై ఉగ్రదాడికి సూత్రధారి మహ్మద్ హఫీజ్ సయాద్ ప్రకటించాడు. భారత్‌కు సరైన రీతిలో గుణపాఠం చెబుతామని పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లోని మీర్‌లో జరిగిన ఓ సభలో వెల్లడించాడు. భారత ప్రధాని నరేంద్ర మోదీకి సరైన రీతిలో సమాధానం చెబుతామన్న హఫీజ్ ‘కాశ్మీర్ మిలిటెంట్లతోనే సర్జికల్ దాడులు చేయిస్తాం’ అని అన్నాడు. ‘మోదీ తాను చేయాలనుకున్నది చేసి చూపారు. ఇప్పుడు మా వంతు వచ్చింది. మా తడాఖా చూపుతాం. కాశ్మీర్ మిలిటెంట్లతోనే సర్జికల్ దాడులు చేస్తాం’ అని హఫీజ్ పేర్కొన్నాడు. మద్దతుదారులు జిహాదీ, జిహాదీ అంటూ నినాదాల మధ్య హఫీజ్ ఈ ప్రకటన చేశాడు. గత వారమే పాకిస్తాన్ ప్రధాని నవాజ్ షరీఫ్‌పై తీవ్రమైన విమర్శలు చేశాడు. భారత్ పట్ల షరీఫ్ మెతక వైఖరి అవలంబిస్తున్నాడని మండిపడ్డాడు. ఈసారి పాకిస్తాన్ సైన్యం కూడా అదే తరహా దాడులు చేస్తుందని హఫీజ్ చేసిన వ్యాఖ్యలపై విమర్శలు వెల్లువెత్తాయి. సైన్యం అతడి వ్యాఖ్యలను తప్పుపట్టింది.