అంతర్జాతీయం

విజేత ఎవరు?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విదేశీ శక్తుల నుంచి
అమెరికాను కాపాడటం కోసం ఓట్లేయండి. దేశ
చరిత్రలో మునె్నన్నడూ లేని విధంగా అద్భుత
విజయాన్ని
సాధించబోతున్నాం.
-డొనాల్డ్ ట్రంప్

విభజన, ఐక్యత అన్న వాటిలో ఏదో ఒకటి ఎంచుకోవలసిన సమయం వచ్చింది. మన పిల్లలు, వారి పిల్లలకు ఎలాంటి దేశం ఇవ్వాలో నిర్ణయించుకోవాలి.
-హిల్లరీ క్లింటన్

వాషింగ్టన్, నవంబర్ 7: ప్రపంచం అంతా ఉత్కంఠగా ఎదురు చూస్తున్న అమెరికా అధ్యక్ష ఎన్నికలకు మరి కొద్ది గంటల్లో తెరపడనుంది. గత కొద్ది మాసాలుగా నువ్వా? నేనా అన్నట్లు సాగిన ప్రచారం సోమవారం అర్ధరాత్రి ముగిసింది. రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలు, డెమొక్రాట్ అభ్యర్థి హిల్లరీ క్లింటన్‌పై ఈ-మెయిల్ వివాదంతో ఎన్నికల ప్రచారం అంతా వాడివేడిగా సాగింది. అయితే సరిగ్గా ప్రచారం ముగియటానికి కొద్ది ముందు హిల్లరీకి ఎఫ్‌బిఐ తీపి కబురు వినిపించింది. ఈమెయిల్ స్కాంలో హిల్లరీకి క్లిన్‌చిట్ ఇచ్చింది. దీంతో ఆమెకు మరింత బలం చేకూరినట్లయింది. ఉత్తర కరోలినాలో హిల్లరీ క్లింటన్ తన ప్రచారాన్ని ముగించారు. మరోవైపు మిచిగాన్‌లో ప్రచారం ముగించిన డొనాల్డ్ ట్రంప్ తనదే గెలుపని ధీమాగా
చెప్తున్నారు. విదేశీ శక్తుల నుంచి అమెరికాను కాపాడటం కోసం మంగళవారం జరిగే ఎన్నికల్లో తనకు ఓటేసేందుకు తరలి రావాలని ట్రంప్ చివరిసారి పిలుపునిచ్చారు. మిచిగాన్ రాష్ట్రం నుంచి తనకు భారీ మద్దతు లభించనుందని ట్రంప్ భావిస్తున్నారు. అటు క్లింటన్ తన తుది ప్రచారంలో మాట్లాడుతూ ఒకవేళ ఓట్లు తారుమారైతే(ట్రంప్‌కు అనుకూలంగా పడితే) సుదీర్ఘ కాలంగా అమెరికాలో ఉన్న మహిళలు, మైనార్టీల సమానత్వానికి ముప్పు వాటిల్లుతుందని ఓటర్లను హెచ్చరించారు. నిర్ణయాత్మక రాష్ట్రాల్లో తానే ఆధిక్యంలో ఉన్నానని ట్రంప్ ధీమాగా చెప్తున్నారు. ‘‘అమెరికా చరిత్రలో మనం ఒక అద్భుతమైన విజయాన్ని సాధించబోతున్నాం.’’ అని ట్రంప్ స్పష్టంగా చెప్తున్నారు. ‘‘నా అంచనా ప్రకారం వాషింగ్టన్ డిసిలోని లెస్‌బర్గ్, కొలరాడో, వర్జీనియా లలో నాకే ఆధిక్యం లభిస్తుంది. నెవాడాలో బాగానే ప్రజల మద్దతు లభిస్తోంది. ఉత్తర కరోలినా, ఫ్లోరిడా, పెన్సిల్వేనియాలలో నేనే గెలుస్తున్నా’’ అని ట్రంప్ ధీమాగా అంటున్నారు. హిల్లరీ మద్దతుతో జరిగిన వ్యాపార ఒప్పందాలన్నింటినీ రద్దు చేస్తానని, దేశంలోకి వలసలను నియంత్రిస్తానని ట్రంప్ మళ్లీ చెప్పారు. అటు హిల్లరీ క్లింటన్ తనకు ఆధిక్యం ఉన్న ఓహియో, న్యూహాంప్‌షైర్ లలో ప్రచారం చేశారు. ‘‘విభజనా, లేక ఐక్యతా అన్న వాటిలో ఏదో ఒకటి ఎంచుకోవలసిన సమయం ఆసన్నమైంది. మన పిల్లలకు, వారి పిల్లలకు ఎలాంటి దేశం కావాలని కోరుకుంటున్నామో నిర్ణయించుకోవలసిన పరిస్థితి ఏర్పడింది. 2004 ఇరాక్ యుద్ధంలో చనిపోయిన అమెరికన్ ముస్లిం ఆర్మీ కెప్టెన్ హుమాయూన్‌ఖాన్ కుమారుడు హిజ్ ఖాన్ ఏర్పాటు చేసిన ర్యాలీలో ఆమె మాట్లాడారు. క్లింటన్, ట్రంప్ ఇద్దరూ పెద్ద ఎత్తున ఒకరిపై ఒకరు తీవ్రస్థాయిలో ఆరోపణలు చేసుకున్నారు. వారి వారి మద్దతు దారులు సైతం అదే స్థాయిలో ప్రత్యర్థులపై విరుచుకుపడుతున్నారు. ‘అమెరికాను మళ్లీ గొప్పగా చేద్దాం’’, ‘ఉగ్రవాదాన్ని ఆపుదాం. ట్రంప్‌ను గెలిపిద్దాం’’ వంటి నినాదాలు రాసిన ప్లకార్డులు ప్రదర్శించారు.