అంతర్జాతీయం

అండాల పునరుత్పత్తికి కొత్త పద్ధతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాషింగ్టన్, నవంబర్ 13: మాతృత్వం కోసం పరితపిస్తున్న మహిళలకు శుభవార్త. మహిళల నుంచి సేకరించిన వ్యర్థ జన్యు పదార్థాన్ని ఉపయోగించి మానవ అండాలను పునరుత్పత్తి చేసే సరికొత్త పద్ధతిని శాస్తవ్రేత్తలు కనుగొన్నారు. పోలార్ బాడీస్‌గా పిలిచే అండాల్లోని చిన్న చిన్న కణాల నుంచి వచ్చే ఈ వ్యర్థ జన్యు పదార్థం (డిఎన్‌ఎ) మహిళ అండ కేంద్రకంలోని జన్యు పదార్థానే్న కలిగి ఉంటుంది. సంతాన సాఫల్య చికిత్సకోసం చురుకుగా పనిచేసే మానవ అండాలను ఉత్పత్తి చేసేందుకు పోలార్ బాడీస్ ఉపయోగపడతాయని ఇప్పటివరకూ ఎవరూ భావించలేదు. అయితే అమెరికాలోని సల్క్ బయోలాజికల్ స్టడీస్, ఆరెగాన్ హెల్త్ అండ్ సైన్స్ యూనివర్శిటీకి చెందిన శాస్తవ్రేత్తలు ఈ విషయాన్ని వెలుగులోకి తీసుకొచ్చారు. ఒక మహిళ అండంలో అభివృద్ధి చెందుతున్న మాతృజీవకణం నుంచి సేకరించిన పోలార్ బాడీని కేంద్రకాన్ని తొలగించిన మరో మహిళ (దాత) మాతృకణంలోని సైటోప్లాజమ్‌లోకి వారు విజయవంతంగా ప్రవేశపెట్టగలిగారు. అయతే ఈ పద్ధతిని మరింత అభివృద్ధి చేసి సంతాన సాఫల్య పరీక్షలకు అందుబాటులోకి తీసుకొచ్చేందుకు చాలా ఏళ్లు పట్టే అవకాశం ఉంది.