అంతర్జాతీయం

ఇల్లు వదిలి రావద్దనుకున్నా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాషింగ్టన్, నవంబర్ 17: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ చేతిలో ఓటమి పాలైన తరువాత మొట్టమొదటిసారి హిల్లరీ ఇల్లు వదిలి బయటకు వచ్చారు. ఎన్నికల్లో ఓడిపోయిన తరువాత తాను ఇంటికే పరిమితమవాలని అనుకున్నానని, మంచి పుస్తకాలు చదువుకుంటూ గడపాలని అనుకున్నానని ఆమె అన్నారు. ‘బాలల రక్షణ నిధి’ ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. తాను బయటకు రావద్దని అనుకున్నప్పటికీ, తన తల్లి చాలా కాలం క్రితం తనకు చెప్పిన మాటలు గుర్తుకు వచ్చి తిరిగి ప్రజల్లోకి వచ్చానన్నారు. ‘‘ ఈ విధంగా ప్రజల్లోకి రావటం నాకు చాలా ఇబ్బందికరమే. నేను అసలు ఇంట్లోనే ఉండిపోదామనుకున్నా.’’ అని ఆమె అన్నారు. తనకు ఈ ఎన్నికలు తీవ్ర నిరాశను మిగిల్చాయని, ఈ రకమైన ఫలితాన్ని తాను ఊహించనే లేదని ఆమె అన్నారు.