అంతర్జాతీయం

అమెరికా విదేశాంగ మంత్రిగా నిక్కీ హేలీ?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాషింగ్టన్, నవంబర్ 17: అమెరికా కొత్త అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వంలో విదేశాంగ మంత్రిగా భారతీయ సంతతికి చెందిన అమెరికన్ నిక్కీ హేలీ నియమితమయ్యే అవకాశాలున్నాయంటూ కధనాలు జోరుగా సాగుతున్నాయి. రెండు సార్లు దక్షిణ కరోలినా గవర్నర్‌గా పనిచేసి తన సమర్థతను చాటుకున్న నిక్కి హేలీ కొత్త అధ్యక్షుడ్ని కలుసుకోనున్న నేపథ్యంలో విదేశాంగ మంత్రి పదవి ఆమెకు ఖాయమన్న వాదనకు మరింత బలం చేకూరింది. ఈ పదవి కాకపోయినా ట్రంప్ పాలనా యంత్రాంగంలో నిక్కీకి ఏ మంత్రి పదవి లభించినా అది భారతీయులందరికీ గర్వకారణం. రిపబ్లికన్ పార్టీలో ఇటీవలి కాలంలో అత్యిధిక జనాదరణను నిక్కీ పార్టీ గవర్నర్ల సంఘం ఉపాధ్యక్షురాలిగా ఎన్నికయ్యారు. ఎప్పుడో అమృతసర్ నుంచి అమెరికాకు వలస వెళ్లిన సిక్కుల సంతతికి చెందిన నిక్కీ హేలీ అసలు పేరు నిమ్రతా నిక్కీ రణధవా హేలీ. మైఖేల్ హేలీని పెళ్లి చేసుకుని క్రైస్తవ మతాన్ని స్వీకరించారు. 2014లో వీరిద్దరూ అమృతసర్‌లోని స్వర్ణాలయాన్నీ సందర్శించారు. ట్రంప్ కేబినెట్‌లో నిక్కీకి ఏ పదవి లభించినా అది భారత-అమెరికన్లు సాధించిన తొలి ఘనత అవుతుంది.కొత్త ప్రభుత్వం ఎలా ఉండాలన్న దానిపై కసరత్తు చేస్తున్న ట్రంప్, ఉపాధ్యక్షుడు మైక్ పెన్స్‌లు అర్హులపై దృష్టి సారించారు.