అంతర్జాతీయం

బ్రిటన్‌కు బహుమతిగా ఇచ్చాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఏప్రిల్ 18: బ్రిటిష్ పాలకులు కోహినూర్ వజ్రాన్ని మననుంచి బలవంతంగా తీసుకోలేదని, దొంగిలించలేదని కేంద్ర ప్రభుత్వం సోమవారం సుప్రీంకోర్టుకు చెప్పింది. పంజాబ్ పాలకులు ఈ వజ్రాన్ని ఈస్టిండియా కంపనీకి ఇచ్చారని తెలిపింది. ‘మహారాజా రంజిత్ సింగ్ తరువాత పంజాబ్‌ను పాలించిన పాలకులు సిక్కు యుద్ధంలో తమకు సహకరించిన ఈస్టిండియా కంపనీకి పరిహారంగా 1849లో కోహినూర్ వజ్రాన్ని ఇచ్చినందువల్ల దాన్ని బలవంతంగా తీసుకున్నట్లు కాని దొంగిలించినట్లు కాని చెప్పజాలం’ అని సొలిసిటర్ జనరల్ రంజిత్ కుమార్.. ప్రధాన న్యాయమూర్తి టిఎస్ ఠాకూర్ నేతృత్వంలో న్యాయమూర్తి యుయు లలిత్‌తో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనానికి చెప్పారు. ప్రపంచంలోనే అత్యంత విలువయిన వజ్రాలలో ఒకటయిన కోహినూర్ వజ్రం తమదేనని, అందువల్ల దాన్ని తిరిగి ఇవ్వాలని కోరడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందా? అని అత్యున్నత న్యాయస్థానం ప్రశ్నించింది.
కోహినూర్ వజ్రాన్ని తిరిగి తీసుకురావాలనే డిమాండ్ పార్లమెంటులో పలుసార్లు వచ్చిందని సొలిసిటర్ జనరల్ అత్యున్నత న్యాయస్థానానికి తెలిపారు. ‘కోహినూర్ వజ్రం వంటి సంపదను తిరిగి ఇవ్వాలని ఇతర దేశాలను మనం కోరితే, ఇక ప్రతి దేశమూ తమ వస్తువులను తిరిగి ఇవ్వాలని మనలను కోరుతుంది. అప్పుడు మన భాండాగారాలలో (మ్యూజియాలలో) ఏమీ మిగలవు’ అని సొలిసిటర్ జనరల్ చెప్పారు. దీంతో ఆరు వారాల్లోగా సమగ్రమైన సమాధానం ఇవ్వాలని ధర్మాసనం సొలిసిటర్ జనరల్‌ను ఆదేశించింది. కోహినూర్ వజ్రం వంటి వాటిని తిరిగి తీసుకురావడానికి వీలుగా ఆదేశాలు జారీ చేయాలని దాఖలయిన ఈ ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని (పిల్)ను కొట్టివేయడం వైపు తాము మొగ్గు చూపడం లేదని ధర్మాసనం తెలిపింది.