అంతర్జాతీయం

భవిష్యత్తులో చికిత్స కనుగొనేదాకా నా మృతదేహాన్ని భద్రపరచండి!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లండన్, నవంబర్ 18: బ్రిటన్ చరిత్రలోనే మొట్టమొదటిసారిగా అరుదైన క్యాన్సర్ వ్యాధితో బాధపడుతూ మృత్యువుకు చేరువైన ఓ టీనేజ్ బాలిక భవిష్యత్తులో తన వ్యాధికి వైద్యాన్ని కనుగొనే దాకా తన మృతదేహాన్ని కాపాడడం కోసం జరిపిన చారిత్రక న్యాయ పోరాటంలో చనిపోవడానికి కొద్ది రోజుల ముందు విజయం సాధించింది. శుక్రవారం ఈ కేసు వివరాలు వెల్లడయ్యాయి. తల్లిదండ్రులు విడాకులు తీసుకోవడంతో ఆ బాలిక తన తల్లితో లండన్‌లో ఉంటోంది. క్రయోజనిక్ పద్ధతిలో( శీతలీకరణ పద్ధతిలో తన దేహంలోని కణాలు, కణజాలాలను పరిరక్షించడం ద్వారా తన మృతదేహాన్ని పరిరక్షించాలన్న ఆ బాలిక చివరి కోరికకు ఆమె తల్లి మద్దతు తెలియజేయగా, తండ్రి మాత్రం అంగీకరించలేదు. తాను సుదీర్ఘకాలం జీవించాలని కోరుకుంటున్నానని, భూమిలోపల ఖననం చేయడం తనకు ఇష్టం లేదని వివరిస్తూ ఆ బాలిక న్యాయమూర్తికి ఒక లేఖ కూడా రాసింది. గత అక్టోబర్‌లో మరణించిన 14 ఏళ్ల ఆ బాలికను అమెరికాకు తీసుకెళ్లి అక్కడ భద్రపరచడం జరిగింది. అయితే ఆ బాలిక పేరును మాత్రం ఎక్కడా పేర్కొనకుండా ‘జెఎస్’ అని మాత్రమే పేర్కొనడం జరిగింది. ఆ బాలిక కేసుకు సంబంధించిన వివరాలు ఇప్పుడు వెల్లడయ్యాయి. తనకు చనిపోవాలని లేదని, అయితే తాను చనిపోతానని తెలుసునని, అందుకే వందల ఏళ్ల తర్వాతనైనా తన వ్యాధి నయం అయి తిరిగి జీవించడానికి తనకొక అవకాశమివ్వాలని ఆ బాలిక జడ్జికి రాసిన లేఖలో పేర్కొంది.