అంతర్జాతీయం

రాజకీయ నిబద్ధత అత్యంత అవసరం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మరకేశ్, నవంబర్ 18: వాతావరణ మార్పుపై పోరాడటానికి అత్యంత ఉన్నత స్థాయిలో రాజకీయ నిబద్ధతను ప్రదర్శించాలని భారత్ సహా సుమారు 200 దేశాలు పిలుపునిచ్చాయి.
చరిత్రాత్మక పారిస్ ఒప్పందం నుంచి అమెరికా బయటకు వస్తుందని ఆ దేశానికి కొత్తగా అధ్యక్షుడిగా ఎన్నికయిన డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించిన నేపథ్యంలో ఇక్కడ జరిగిన కీలకమైన ఐక్యరాజ్య సమితి (ఐరాస) శిఖరాగ్ర సమావేశంలో సుమారు 200 దేశాలు ఈ పిలుపునివ్వడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఐరాస శిఖరాగ్ర సమావేశంలో పాల్గొన్న 196 దేశాలు, యూరోపియన్ యూనియన్ (ఇయు) మరకేశ్ కార్యాచరణ ప్రకటనను ఆమోదించాయి. ఈ కార్యాచరణ ప్రకటనను ఐరాస కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ (సిఒపి) ప్లీనరీ సెషన్‌లో ప్రకటించారు. ఐరాస శిఖరాగ్ర సమావేశంలో తీసుకున్న ప్రధాన నిర్ణయాలలో ఈ కార్యాచరణ ప్రకటన ఒకటి. భూతాపం (గ్లోబల్ వార్మింగ్) పట్ల స్పందించడం ప్రపంచ అత్యవసర విధి అని మరకేశ్ కార్యాచరణ ప్రకటన పేర్కొంది. ‘మన వాతావరణం ప్రమాదకర స్థాయిలో వేడెక్కుతోంది. అసాధారణ రీతిలో ఇది జరుగుతోంది.
దీనిపట్ల స్పందించడం మన అత్యవసర విధి. వాతావరణ మార్పుకు వ్యతిరేకంగా అత్యవసర ప్రాధాన్యతతో అత్యంత ఉన్నత రాజకీయ నిబద్ధతతో పోరాడాలని మేము పిలుపునిస్తున్నాం’ అని మరకేశ్ సాధికార ప్రకటన పేర్కొంది. ‘వాతావరణ మార్పు వల్ల తీవ్రంగా దెబ్బతినడానికి అనువుగా అత్యంత దుర్బలంగా ఉన్న దేశాలకు గట్టి సంఘీభావాన్ని ప్రకటించాలని మేము పిలుపునిస్తున్నాం. ఇలాంటి దేశాలు ఆ దుస్థితి నుంచి బయట పడటానికి, తిరిగి బలోపేతం కావడానికి చేసే కృషికి మద్దతివ్వాలని మేము పిలుపునిస్తున్నాం’ అని ఆ ప్రకటన వివరించింది. గత సంవత్సరం డిసెంబర్‌లో ఆమోదం పొంది, ఇప్పటి వరకు 111 దేశాలు ధ్రువీకరించిన చరిత్రాత్మక పారిస్ ఒప్పందాన్ని అమలు చేయడానికి అవసరమైన బ్లూప్రింట్ (వివరణాత్మక పథకం)ను ఐరాస శిఖరాగ్ర సమావేశం రూపొందించడానికి ఒక రోజు ముందు మరకేశ్ కార్యాచరణ ప్రకటన వెలువడింది.