అంతర్జాతీయం

మరణశిక్షపై నిషేధాన్ని వ్యతిరేకించిన భారత్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూయార్క్, నవంబర్ 19: మరణశిక్షపై నిషేధం విధించాలని విజ్ఞప్తి చేస్తూ ఐక్యరాజ్య సమితి రూపొందించిన తీర్మానాన్ని భారత్ వ్యతిరేకించింది. ఈ తీర్మానం భారతీయ చట్టాలతోపాటు సొంత న్యాయ వ్యవస్థ ఏవిధంగా ఉండాలనే విషయాన్ని నిర్దేశించుకోవడంలో ప్రతి దేశానికి గల సార్వభౌమాధికార హక్కులకు విరుద్ధంగా ఉందని భారత ప్రతినిధి మయాంక్ జోషి స్పష్టం చేశారు. అయితే దేశీయ న్యాయ వ్యవస్థలను అభివృద్ధి చేసుకునేందుకు గల సార్వభౌమాధికార హక్కులకు భంగం వాటిల్లకుండా ఈ తీర్మానాన్ని సవరించేందుకు భారత్ మద్దతు తెలుపుతోందని, అందుకే ఈ తీర్మానానికి వ్యతిరేకంగానూ, సవరణకు అనుకూలంగానూ ఓటు వేశానని ఆయన తెలిపారు. అయినప్పటికీ ఐక్యరాజ్య సమితిలో ఈ తీర్మానం ఆమోదం పొందింది. ఈ తీర్మానానికి అనుకూలంగా 115 ఓట్లు, వ్యతిరేకంగా 38 ఓట్లు రాగా, 31 సభ్యదేశాల ప్రతినిధులు ఓటింగ్‌కు దూరంగా ఉన్నారని ఐక్యరాజ్య సమితి తన వెబ్‌సైట్‌లో ప్రకటించింది. కాగా, ఈ తీర్మాన సవరణకు కూడా ఐక్యరాజ్య సమితిలో ఆమోదం లభించింది. సవరణకు అనుకూలంగా 76 ఓట్లు, వ్యతిరేకంగా 72 ఓట్లు రాగా, 26 దేశాల ప్రతినిధులు ఓటింగ్‌లో పాల్గొనలేదు. ఈ అంశంపై భారత్ వైఖరిని మయాంక్ జోషి వివరిస్తూ, సమాజానికి దిగ్భ్రాంతిని కలిగిచేలా అత్యంత దారుణమైన నేరాలకు పాల్పడిన వారికి మాత్రమే చాలా అరుదుగా భారత్‌లో మరణశిక్షలు విధిస్తున్నట్లు తెలిపారు.