అంతర్జాతీయం

తొలి గుండె మార్పిడి వైద్యుడు కన్నుమూత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హ్యూస్టన్, నవంబర్ 19: ప్రపంచంలోనే మొట్టమొదటిసారి కృత్రిమ గుండె ఆపరేషన్ చేసిన డెంటాన్ కూలే (96) శనివారం కన్నుమూశారు. అమెరికాకు చెందిన కూలే టెక్సాస్‌లో హార్ట్ ఇనిస్టిట్యూట్‌ను స్థాపించారు. కార్డియోవ్యాస్కులర్ సర్జరీలో ఇప్పటికీ ఆయన వినియోగించిన టెక్నిక్‌నే వాడుతున్నారు. కూలే తన బృందంతో కలిసి 1,18,000 గుండె ఆపరేషన్లు చేశారు.
డెంటాన్ కూలే మృతిపై అమెరికా మాజీ అధ్యక్షుడు హెచ్‌డబ్ల్యూ బుష్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన మృతితో ఓ అనుభవజ్ఞుడైన వైద్యుడిని కోల్పోయామని బుష్ తన సంతాప సందేశంలో పేర్కొన్నారు. కూలే హ్యూస్టన్‌లోనే స్థిరపడ్డారు. ఆయన భార్య లూయిస్ గోల్డ్స్‌బొరోహ్ (92) గత నెల 21న మృతి చెందారు. కూలే రోజుకు 18 గుండె ఆపరేషన్లు చేసేవారు.