అంతర్జాతీయం

ఎలాంటి సవాళ్లనైనా ఎదుర్కొంటాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇస్లామాబాద్/లాహోర్, నవంబర్ 21: దేశ భద్రతకు సంబంధించి ఎలాంటి సవాళ్లనైనా ఎదుర్కోడానికి సైన్యం సిద్ధంగా ఉందని పాకిస్తాన్ సర్వసేన్యాధికారి రహీల్ షరీఫ్ వెల్లడించారు. ఈ నెల 29న పదవీ విరమణ చేయనున్న రహీల్ సోమవారం నుంచి ఫేర్‌వెల్ విజిట్ ప్రారంభించారు. ఆయన పదవీకాలం పొడిగిస్తారని మీడియాలో కథనాలకు వెలువడ్డాయి. అయితే రహీల్ ఫేర్‌వెల్ టూర్‌తో పదవీకాలం పొడిగింపు లేనట్టే. రహీల్ ఫేర్‌వెల్ టూర్ లాహోర్ నుంచి మొదలైందని మిలటరీ అధికార ప్రతినిధి లెఫ్టినెంట్ జనరల్ ఆసీం సలీం బాజ్వ తెలిపారు.
రహీల్ పర్యటకు సంబంధించిన వివరాలు బాజ్వ తన ట్విట్టర్‌లో వెల్లడించారు. లాహోర్ సైనిక స్థావరంలో రక్షణ దళాన్ని ఉద్దేశించి ప్రసంగించిన సైనిక ప్రధానాధికారి శాంతి, సుస్థిరత నెలకొల్పడమన్నది సులభం కాదని స్పష్టం చేశారు. ‘మన త్యాగాలు, సమష్టి కృషి దేశ భద్రతకు దోహదం చేస్తాయి’ అని అన్నారు.
ఎల్‌ఓసి వద్ద ఉద్రిక్తతల నేపథ్యంలో రహీల్ మాట్లాడుతూ ‘దేశ భద్రత విషయంలో రాజీలేదు. ఎలాంటి పరిస్థితులనైనా ధీటుగా ఎదుర్కొనే శక్తి సామర్థాలు మనకు ఉన్నాయి’ అని ఉద్ఘాటించారు. ఎలాంటి ప్రతికూల పరిస్థితులనైనా ఎదుర్కొనే ధైర్యం పాకిస్తాన్ ప్రజలకు ఉందని ఆయన ప్రకటించారు.