అంతర్జాతీయం

జపాన్‌లో తీవ్ర భూకంపం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

టోక్యో, నవంబర్ 22: ఈశాన్య జపాన్ ప్రాంతాన్ని రిక్టర్ స్కేలుపై 6.5 తీవ్రతతో తీవ్ర భూకంపం మంగళవారం కుదిపేసింది. దీని ప్రభావం అత్యంత శక్తివంతంగా ఉండటంతో అధికారులు సునామీ హెచ్చరికలు జారీ చేశారు. చాలా చోట్ల కెరటాలు మీటరుకు పైగా ఎగిసి పడినట్టుగా కథనాలు వెలువడ్డాయి. అయితే వీటి తీవ్రత ఎక్కువగా లేదని అధికారులు నిర్థారించారు. దాదాపు ఏడు గంటల తర్వాత సునామీ హెచ్చరికల్ని ఉపసంహరించారు. మొదట్లో ప్రజలు భయాందోళనలతో బయటికి పరుగులు పెట్టినప్పటికీ ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరుగలేదు. భూకంప ప్రాంతంలో 14మందికి స్వల్పంగా గాయాలయ్యాయి.