అంతర్జాతీయం

ఘోర విమాన ప్రమాదం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బొగోటా, నవంబర్ 29: బ్రెజిలియన్ ఫుట్‌బాల్ జట్టు ప్రయాణిస్తున్న చార్టర్డ్ విమానం ఒకటి మంగళవారం కొలంబియాలోని పర్వత ప్రాంతాల్లో కూలిపోవడంతో కనీసం 75 మంది చనిపోయారని అధికారులు తెలిపారు. ఈ ప్రమాదంపై స్పందించిన బ్రెజిల్ అధ్యక్షుడు మైకేల్ టెమెర్ మూడు రోజులు జాతీయ సంతాప దినాలుగా ప్రకటించారు. ‘ఎలక్ట్రికల్ వైఫల్యం’ కారణంగా లామియా ఎయిర్‌లైన్స్‌కు చెందిన చార్టర్డ్ విమానం మంగళవారం ఉదయం మెడిలియన్ సిటీ సమీపంలో కూలిపోయినట్లు అధికారులు తెలిపారు. బుధవారం కొలంబియాకు చెందిన అట్లెటికో నేషనల్ టీమ్‌తో కోపా సుదామెరికానా ఫైనల్ ఆడడం కోసం వెళ్తున్న బ్రెజిల్‌కు చెందిన చాపెకోనే్స రియల్ ఫుట్‌బాల్ క్లబ్ క్రీడాకారులు ఈ విమానంలో ఉన్నారు. ‘ఇది చాలా బాధాకరమైన సంఘటన’ అని క్లబ్ ఉపాధ్యక్షుడు ఇవాన్ టోజ్జో గ్లోబో స్పోర్ట్స్ టీవీకి చెప్పారు. బ్రిటీష్ ఏరోస్పేస్ 146 విమానంలో మొత్తం 72 మంది ప్రయాణికులు, తొమ్మిది మంది సిబ్బంది ఉన్నారు. అయితే ముగ్గురు ఫుట్‌బాల్ ఆటగాళ్లు సహా ఆరుగురు ప్రాణాలతో బైటపడ్డారని కొలంబియా అధికారులు చెప్తూ, మరికొందరు కూడా ప్రాణాలతో ఉంటారని ఆశిస్తున్నామని తెలిపారు. బ్రెజిల్‌లోని సావోపోలోనుంచి బైలుదేరిన లామియా ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానం మెడిలిన్ సిటీకి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. స్థానిక కాలమానం ప్రకారం ఉదయం 10 గంటలకు విమానంనుంచి ఎమర్జెన్సీ కాల్ వచ్చిందని, ఆ తర్వాత కొద్ది సేపటికే కొలంబియాలోని రెండవ పెద్ద నగరమైన మెడిలిన్‌కు 50 కిలోమీటర్ల దూరంలో సెర్రా గోర్డో అనే ప్రాంతంలో కూలిపోయిందని అధికారులు చెప్పారు. విమానం కూలిపోయిన పర్వత ప్రాంతం సముద్రమట్టానికి 3 వేల మీటర్ల ఎత్తులో ఉందని, గా అక్కడికి వెళ్లడం చాలా కష్టంగా ఉందని సంఘటన సమీపంలోని లా సెజా పట్టణ మేయర్ ఎల్కిన్ ఒస్పినా చెప్పారు. దీనికి తోడు వర్షం కురుస్తుండడంతో సహాయక చర్యలు చేపట్టడానికి తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. అధికారులు మంగళవారం ముందుగానే సహాయక చర్యలను నిలిపివేశారు. బుధవారం ఉదయం తిరిగి సహాయక, గాలింపు చర్యలు కొనసాగిస్తామని చెప్పారు. కాగా, ఈ ప్రమాదం కారణంగా బుధవారం జరగాల్సిన కోపా సుదామెరికానా ఫైనల్ మ్యాచ్‌ని రద్దు చేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు.

చిత్రం.. కొలంబియాలో మంగళవారం 3వేల మీటర్ల ఎత్తునుంచి కుప్పకూలి తునాతునకలైన లామియా ఎయిర్‌లైన్స్ విమానం