జాతీయ వార్తలు

ఉగ్రవాదంపై పోరుకు సహకారం కీలకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మాస్కో, ఏప్రిల్ 18: పంజాబ్‌లోని పఠాన్‌కోట్ వైమానిక స్థావరంపై దాడుల వెనుక ప్రధాన పాత్ర పోషించిన పాకిస్తాన్ ఉగ్రవాద సంస్థ జైషే మహ్మద్ అధినేత మసూద్ అజార్‌ను అప్పగించాలని ఐక్యరాజ్య సమితిలో చేసిన వాదనను చైనా అడ్డుకోవడం పట్ల భారత్ తీవ్ర అభ్యంతరాన్ని వ్యక్తం చేసింది. ఉగ్రవాదంపై పోరాడేందుకు ద్వైపాక్షిక సహకారం చాలా కీలకమని చైనాకు భారత్ స్పష్టం చేసింది. రష్యా రాజధాని మాస్కోలో ‘రిక్’ (రష్యా-ఇండియా-చైనా) త్రైపాక్షిక సమావేశం సందర్భంగా చైనా విదేశాంగ శాఖ మంత్రి వాంగ్ ఇతో జరిగిన సమావేశంలో విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ ఈ అంశాన్ని ప్రస్తావించారు. ఐక్యరాజ్య సమితి కమిటీ పరిశీలనలో ఉన్న ఉగ్రవాదుల జాబితాలో మసూద్ అజార్ పేరును చేర్చాలని, ఉగ్రవాదం వలన ఉమ్మడిగా నష్టపోతున్న భారత్, చైనా ఈ సమస్యపై పోరాడేందుకు పరస్పరం సహకరించుకోవాల్సిన అవసరం ఉందని సుష్మా స్వరాజ్ స్పష్టం చేశారని, దీంతో ఈ అంశంపై నిరంతరం సంప్రదింపులు కొనసాగించేందుకు ఇరు దేశాల మధ్య అంగీకారం కుదిరిందని విదేశీ వ్యవహారాల శాఖ అధికార ప్రతినిధి వికాస్ స్వరూప్ తెలిపారు. పఠాన్‌కోట్‌లో జరిగిన ఉగ్రదాడితోపాటు గతంలో మన దేశంలో జరిగిన పలు దాడులకు సూత్రధారిగా వ్యవహరించిన మసూద్ అజార్‌ను ఉగ్రవాదిగా ప్రకటించకుండా చైనా ఇటీవల ఐక్యరాజ్య సమితి ఆంక్షల కమిటీని అడ్డుకున్న విషయం తెలిసిందే. ఈ కేసు భద్రతా మండలి నిబంధనలకు అనుగుణంగా లేదని పేర్కొంటూ చైనా ఈ విధంగా వ్యవహరించింది. పాకిస్తాన్‌ను కేంద్రంగా చేసుకుని కార్యకలాపాలు సాగిస్తున్న వివిధ ఉగ్రవాద సంస్థల నాయకులను అప్పగించాలని ఐక్యరాజ్య సమితిలో మన దేశం చేస్తున్న వాదనను చైనా అడ్డుకోవడం ఇదే తొలిసారి కాదు. ఐక్యరాజ్య సమితి 2001లోనే జైషే మహ్మద్‌ను ఉగ్రవాద సంస్థల జాబితాలో చేర్చిన విషయం విదితమే. అయితే 2008లో ముంబయి ఉగ్రదాడుల అనంతరం మసూద్ అజార్‌పై ఆంక్షలు విధించాలని ఐక్యరాజ్య సమితిలో భారత్ చేసినప్పటికీ చైనా తన ‘వీటో’ అధికారాన్ని ఉపయోగించి అడ్డుకోవడంతో అది కార్యరూపం దాల్చలేదు.

చిత్రం మాస్కోలో సోమవారం జరిగిన ‘రిక్’ సమావేశం సందర్భంగా చైనా విదేశాంగ శాఖ మంత్రి వాంగ్ ఇ, రష్యన్ విదేశాంగ మంత్రి సెర్గే లావ్‌రోవ్‌తో సుష్మా స్వరాజ్