అంతర్జాతీయం

55 వారసత్వ సంపదలకు పొంచి ఉన్న ముప్పు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దుబాయి, డిసెంబర్ 2: ప్రపంచ వ్యాప్తంగా 55 వారసత్వ ప్రదేశాలు ప్రమాదపుఅంచున ఉన్నాయని ఐరాస సాంస్కృతిక శాఖ వెల్లడించింది. ప్రపంచంలో 1,052 వారసత్వ ప్రాంతాలున్నాయి. వీటిలో 55 వారసత్వ సంపదలను ప్రమాదపుజాబితాలో చేర్చారు. వారసత్వ ప్రదేశాల పరిరక్షణకు యునెస్కో చర్యలు చేపట్టింది. 2016 జూలై నెలలో ఇస్తాంబుల్‌లో జరిగిన యునెస్కో 40వ వార్షిక సమావేశంలో మాలి, ఉజ్‌బెకిస్తాన్‌లు వారసత్వ ప్రదేశాల జాబితాలో చేర్చారు. ప్రపంచ వారసత్వ సంపదల్లో ఐదోస్థానంలో ఉన్న లిబియా యుద్ధం నేపథ్యంలో ధ్వంసమైంది. యుద్ధాలు, భూకంపాలు, ప్రకృతి వైపరీత్యాలు, జనాభా, ఆక్రమణలు, విచ్చలవిడి పట్టణీకరణ, పరిమితుల్లేకుండా పోయిన పర్యాటక రంగ అభివృద్ధి ప్రపంచ వారసత్వ సంపదకు చేటుచేస్తున్నాయని యునెస్కో వెల్లడించింది. ప్రమాదపుఅంచున ఉన్న వారసత్వ సంపదను కాపాడేందుకు అంతర్జాతీయ సమాజం ముందుకురావాలని పిలుపునిచ్చింది.