అంతర్జాతీయం

ఉగ్రవాదాన్ని తరిమికొడతా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాషింగ్టన్, డిసెంబర్ 2: అమెరికా నుంచి ఉగ్రవాదాన్ని తరిమికొట్టేందుకు తమ ప్రభుత్వం సకల ప్రయత్నాలు చేస్తుందని ఆ దేశ తదుపరి అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ శుక్రవారం స్పష్టం చేశారు. మతదురభిమానం, దురభిప్రాయాలను తిప్పికొట్టి దేశమంతా ఐక్యంగా ఉండాలని ఆయన పిలుపునిచ్చారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఇటీవల విజయం సాధించిన ట్రంప్ కీలక రాష్టమ్రైన ఓహియో నుంచి తన తొలి విజయోత్సవ ర్యాలీని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన సిన్సినాటీలో వేలాది మంది మద్దతుదారులను ఉద్దేశించి ప్రసంగిస్తూ, ఇటీవల ఓహియో యూనివర్శిటీ వద్ద జరిగిన దాడిని ప్రస్తావించారు. తెలివితక్కువ రాజకీయ నాయకుల వలన దేశంలో తలెత్తిన భద్రతా పరమైన సమస్యలను, ప్రమాదాలను పసిగట్టడంలో వైఫల్యమవుతున్న ఇమ్మిగ్రేషన్ వ్యవస్థలోని లొసుగులను ఈ ఘటన ప్రతిబింబిస్తోందన్నారు. ఇస్లామిక్ ఉగ్రవాదం గురించి ట్రంప్ మాట్లాడుతూ, ‘మధ్యప్రాచ్య దేశాల నుంచి ఎంతో మంది మన దేశంలోకి తరలివస్తున్నారు. వారు ఎవరో, ఎటువంటి వారో, ఎక్కడి నుంచి వస్తున్నారో, ఏ ఆలోచనలతో వస్తున్నారో మనకు తెలియదు. ఇటువంటి వివరాలను తెలుసుకోకుండా ఎవరినీ దేశంలోకి రానీయడం శ్రేయస్కరం కాదు. అనుమానస్పద వ్యక్తులను దేశంలోకి రానీయకుండా మనం అడ్డుకుని తీరాలి. కనుక మీ రాష్ట్రంలో ఏమి జరుగుతోందనే విషయాన్ని ఎప్పుడూ నిశితంగా గమనిస్తూ అనునిత్యం అప్రమత్తంగా ఉండాలి’ అని స్పష్టం చేశారు. సోమాలియాకు చెందిన 18 ఏళ్ల విద్యార్థి ఒకడు సోమవారం ఓహియో విశ్వవిద్యాలయం వద్ద కారుతో జనం మీదికి దూసుకురావడంతో పాటు కత్తితో దాడికి తెగబడి 11 మందిని గాయపర్చిన నేపథ్యంలో ట్రంప్ ఈ సూచన చేశారు.