అంతర్జాతీయం

వీరుడికి విప్లవ నివాళి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హవానా, డిసెంబర్ 4: విప్లవ యోధుడు, క్యూబా మాజీ అధ్యక్షుడు ఫిడెల్ క్యాస్ట్రోకు ఆదివారం అంత్యక్రియలు జరిగాయి. నాలుగు రోజుల పాటు దేశవ్యాప్తంగా కొనసాగిన అంతిమ యాత్ర ఆదివారం క్యూబాకు ఆగ్నేయంగా ఉన్న శాంటియాగో డి నగరంలోని శాంటా ఫిజెనియా స్మశాన వాటికలో క్యాస్ట్రో అంత్యక్రియలు జరిగాయి. గంట పాటు జరిగిన కార్యక్రమం అత్యంత నిరాడంబరంగా జరిగిందని క్యూబా ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. కుటుంబ సభ్యులు, అధికారులు, మంత్రులు, వివిధ దేశాల నుంచి వచ్చిన ప్రతినిధి బృందాల సమక్షంలో క్యాస్ట్రో భౌతిక కాయాన్ని సమాధి చేశారని పేర్కొన్నాయి. ఎలాంటి ప్రసంగాలు, ఇతర కార్యక్రమాలను అనుమతించలేదని స్పష్టం చేశాయి. భారత్ నుంచి 20మంది సభ్యులతో ఒక ప్రతినిధి బృందం క్యాస్ట్రో అంత్యక్రియల్లో పాల్గొంది.

చిత్రం..క్యాస్ట్రో శవపేటికను శాంటా ఫిజెనియా స్మశాన వాటికకు తరలిస్తున్న దృశ్యం