అంతర్జాతీయం

బోర్ కొట్టే పాఠాల వల్లే నా కెరీర్ దెబ్బతింది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లండన్, డిసెంబర్ 4: అధ్యాపకులు బోర్ కొట్టేలా పాఠాలు చెప్పారని, ఫలితంగా తనకు డిగ్రీలో సెకండ్ క్లాసే వచ్చిందని, దాని కారణంగానే లాయర్‌గా కెరీర్‌లో చాలా ఆదాయం కోల్పోయానంటూ భారతీయ సంతతికి చెందిన విద్యార్థి ఒకరు ఆక్స్‌ఫర్డ్ యూనివర్శిటీపై కేసు వేసాడు. ఫైజ్ సిద్దీఖి ఈ యూనివర్శిటీకి చెందని బ్రేస్‌నోస్ కాలేజిలో మోడరన్ హిస్టరీ చదివాడు.
అయితే తన స్పెషలిస్ట్ సబ్జెక్ట్ అయిన భారతీయ సామ్రాజ్యవాద చరిత్ర విషయంలో ఆ కాలేజి అధ్యాపకుల నిర్లక్ష్య బోధన కారణంగా 2000 సంవత్సరంలో తనకు డిగ్రీలో సెకండ్ క్లాస్ మార్కులే వచ్చాయని సిద్దికి తన పిటిషన్‌లో పేర్కొన్నాడు. లండన్ హైకోర్టు ఈ వారంలో విచారించిన ఈ కేసులో ఈ నెల చివర్లో తీర్పు రావచ్చని భావిస్తున్నారు. 1999-2000 విద్యా సంవత్సరంలో ఆసియా చరిత్రను బోధించే ఏడుగురు అధ్యాపకుల్లో నలుగురు క్రమశిక్షణా చర్య కింద దీర్ఘకాలిక సెలవులో వెళ్లిపోవడం వల్లనే ఈ సమస్య తలెత్తిందని సిద్దీఖి తరఫు న్యాయవాది రోజర్ మల్లాలియు న్యాయమూర్తికి తెలిపారు. తనకు తక్కువ మార్కులు గనుక రాకపోయి ఉంటే అంతర్జాతీయ కమర్షియల్ లాయరుగా తన కెరీర్ ఉజ్వలంగా ఉండి ఉండేదని సిద్దీఖి బలంగా నమ్ముతున్నాడని ‘సన్‌డే టైమ్స్’ పత్రిక తెలిపింది. అయితే వాష్‌రూక్‌పై సిద్దీఖి వ్యక్తిగత విమర్శలు చేయడం లేదని, ఇలా జరిగేందుకు అవకాశమిచ్చిన యూనివర్శిటీనే తప్పుబడుతున్నారని ఆయన అన్నారు. అయితే సిద్దీఖి ఆరోపణలు నిరాధారమైనవని, అంతేకాదు అతను డిగ్రీ పాసయిన తర్వాత చాలా ఏళ్లు గడిచిపోయాయని, అందువల్ల ఈ పిటిషన్‌ను కొట్టివేయాలని యూనివర్శిటీ వాదించింది.