అంతర్జాతీయం

రేవ్‌పార్టీలో అగ్నిప్రమాదం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆక్లాండ్, డిసెంబర్ 4: అమెరికాలో శనివారం దారుణ దుర్ఘటన చోటు చేసుకుంది. శాన్‌ఫ్రాన్సిస్కోకు సమీపంలోని ఓ భవంతిలో జరుగుతున్న రేవ్‌పార్టీలో అకస్మాత్తుగా అగ్నిప్రమాదం సంభవించటంతో దాదాపు 40మంది మరణించారు.
అమెరికా కాలమానం ప్రకారం రాత్రి 11.30 గంటల ప్రాంతంలో ఆక్లాండ్ ఘోస్ట్ షిప్‌గా పేరున్న రెండంతస్థుల భవంతిలో ఎలక్ట్రానిక్ డాన్స్ మ్యూజిక్ పార్టీ జరుగుతోందని, సుమారు 50 నుంచి వంద మంది వరకు ఈ పార్టీలో పాల్గొన్నారని అగ్నిమాపక సిబ్బంది అధికారులు తెలిపారు.
పార్టీ జరుగుతుండగా ఒక్కసారిగా మంటలు చెలరేగాయని, వేగంగా విస్తరించటంతో చనిపోయిన వారి సంఖ్య ఎక్కువగా ఉందని వివరించారు. తొమ్మిది మృతదేహాలను బయటకు తీశామని, మిగతా మృతదేహాలను కూడా వెలికితీసే కార్యక్రమం కొనసాగుతోందన్నారు. భవంతిలోకి ప్రవేశ ద్వారం, వెలుపలికి వచ్చే ద్వారం ఒకటే ఉండటం వల్ల తప్పించుకోవటానికి అవకాశం లేకుండా పోయిందన్నారు.
నిజానికి నిప్పు ఎక్కడ చలరేగిందో ఏ విధంగా వ్యాపించిందో కారణాలు ఇంకా స్పష్టం కాలేదన్నారు. భవనంలో ఫర్నిచర్ పూర్తిగా తగులబడిపోయిందని, మొత్తం పొగచూరిపోవటంతో సహాయ కార్యక్రమాలకు అంతరాయం ఏర్పడిందని అధికారులు వివరించారు.