అంతర్జాతీయం

కరాచీ హోటల్‌లో అగ్నిప్రమాదం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కరాచీ, డిసెంబర్ 5: పాకిస్తాన్‌లోని కరాచీలో సోమవారం తెల్లవారు జామున నాలుగు నక్షత్రాల హోటల్‌లో చెలరేగడంతో ఊపిరాడక దాదాపు 11 మంది మృతిచెందగా, మరో 75 మంది గాయపడ్డారు. మృతుల్లో ముగ్గురు మహిళలు కూడా ఉన్నారు. పాక్‌లో అతిపెద్ద నగరమైన కరాచీలో ఇటువంటి ఘటన జరగడం రెండు వారాల్లో ఇది నాలుగోసారి. కరాచీలోని షరా ఇ ఫైసల్ ప్రాంతంలో గల రెజెంట్ ప్లాజా హోటల్ కింది అంతస్తులోని వంట గదిలో చెలరేగిన ఈ మంటలు కొద్దిసేపట్లోనే ఆ భవనంలోని ఆరు అంతస్తులకు వ్యాపించడంతో దాదాపు 100 మంది అతిథులు గదుల్లో చిక్కుకు పోయారు. మూడు అగ్నిమాపక శకటాలు చేరుకోగా, సిబ్బంది దాదాపు మూడు గంటలపాటు శ్రమించిన తర్వాత మంటలు అదుపులోకి వచ్చాయ.

మంటలు వ్యాపిస్తుండడంతో
హోటల్ గది అద్దాలను పగలగొట్టి బయటకు దూకడంతో గాయపడిన హమ్మద్ ఆజం (ఫైల్ ఫొటో)

అగ్ని ప్రమాదం జరిగిన రీజెంట్ హోటల్ ఇదే