అంతర్జాతీయం

ఈ ఏటి మేటి వ్యక్తి మోదీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూయార్క్, డిసెంబర్ 5: అమెరికాకు చెందిన అపఖ్యాత టైమ్ మ్యాగజైన్ ప్రతి ఏటా నిర్వహించే ఈ ఏటి మేటి వ్యక్తి(పర్సన్ ఆఫ్ ది ఇయర్) ఆన్‌లైన్ రీడర్స్ పోల్‌లో భారత ప్రధాని నరేంద్ర మోదీ అగ్రస్థానంలో నిలిచారు. ఆదివారం ఆన్‌లైన్ రీడర్ పోల్ ముగిసే సమయానికి మోదీ 18 శాతం ఓట్లతో ముందంజలో ఉన్నారు. అమెరికా నూతన అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ప్రస్తుత అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌లాంటి ప్రపంచ నేతలను వెనక్కి నెట్టి మోదీ ఈ ఘనతను సాధించారు. మోదీ తర్వాతి స్థానంలో ఉన్న ఒబామా, ట్రంప్, వికీలీక్స్ వ్యవస్థాపకుడు జూలియన్ అసాంజే అందరికీ 7 శాతం ఓట్లు మాత్రమే లభించాయి. ఫేస్‌బుక్ వ్యవస్థాపకుడు మార్క్ జుకెన్‌బర్గ్‌కు 2 శాతం, అమెరికా అధ్యక్ష పదవికి పోటీ చేసి ఓడిపోయిన హిల్లరీ క్లింటన్‌కు 4 శాతం ఓట్లు వచ్చాయి. టైమ్స్ పత్రిక సంపాదకులు ఈ వారం చివర్లోతుది ఎంపిక నిర్వహించి 2016 సంవత్సరానికి టైమ్ పర్సన్ ఆఫ్ ది ఇయర్‌ను ప్రకటిస్తారు. అయితే ఆన్‌లైన్ పోల్ ఫలితాలు ప్రపంచ దేశాలు ఈ ప్రముఖ వ్యక్తులను ఎలా చూస్తున్నాయి, 2016 సంవత్సరానికి మోదీ అత్యంత పలుకుబడి కలిగిన వ్యక్తిగా ఎలా నిలిచారో చెబుతాయని పత్రిక తెలిపింది. 2016 సంవత్సరాన్ని అత్యధికంగాప్రభావితం చేసిన వ్యక్తిగా ప్రపంచ ప్రజలు ఎవరిని భావిస్తున్నారనే దానికి ఈ పోల్ ఒక అవకాశాన్ని కల్పిస్తుందని ఆ పత్రిక పేర్కొంది.
మోదీ టైమ్ పర్సన్ ఆఫ్ ది ఇయర్ టైటిల్ కోసం జరిగిన ఆన్‌లైన్ రీడర్ పోటీలో విజయం సాధించడం ఇది రెండోసారి. 2014లో సైతం మోదీ 16 శాతానికి పైగా ఓట్లు సాధించి అగ్రస్థానంలో నిలిచినప్పటికీ .. పర్సన్ ఆఫ్ ది ఇయర్‌గా ఎబోలా వ్యాధిపై పోరాటం జరిపిన వారికి పత్రిక పట్టం కట్టింది. ఏడాది కాలంలో వార్తల్ని, ప్రపంచాన్ని ఎక్కువగా అపభావితం చేసిన వ్యక్తులకు పత్రిక ఈ అవార్డును ఇస్తుంది. 2015లో జర్మనీ చాన్సలర్ ఏంజెలా మెర్కెల్ టైమ్ పత్రిక పర్సన్ ఆఫ్‌ది ఇయర్‌గా ఎంపిక అయ్యారు. ప్రతి ఏడాది టైమ్ పత్రిక సంపాదక బృందం ప్రపంచ నేతలు దేశాధ్యక్షులు, ఉద్యమకారులు, వ్యోమగాములు, పాప్ ఐకాన్స్‌గా నిలిచిన కొంతమందిని ఎంపిక చేసి ఆన్‌లైన్ ఓటింగ్ నిర్వహిస్తుంది. గత సెప్టెంబర్‌లో నిర్వహించిన ఒక పోల్ ప్రకారం ఇటీవలి నెలల్లో భారతీయుల్లో అత్యధిక శాతం మంది మోదీని గొప్ప నాయకుడిగా గుర్తించడం జరిగిందని ఆ పత్రిక పేర్కొంది. కాగా, ఇటీవల 500, వెయ్యి రూపాయల నోట్లను రద్దు చేయడం, ఫలితంగా నగదుపై ఆధారపడిన వ్యాపారాలు, దేశ ఆర్థిక వ్యవస్థపై దాని ప్రభావం తీవ్రంగా ఉన్న నేపథ్యంలో తాజాగా మోదీ పని తీరును జనం గమనిస్తూ ఉన్నారని కూడా ఆ పత్రిక తెలిపింది.
పర్సన్ ఆఫ్ ది ఇయర్ కాదు.. పర్సన్ ఆఫ్ ది సెంచరీ
కాగా, టైమ్ పత్రిక 2016 సంవత్సరానికి నిర్వహించిన ఆన్‌లైన్ రీడర్ పోల్‌లో ప్రధాని నరేంద్ర మోదీ అగ్రస్థానంలో నిలవడంపై బిజెపికి చెందిన పలువురు కేంద్ర మంత్రులు హర్షం వ్యక్తం చేయగా, ప్రతిపక్ష నాయకులు మాత్రం అలాంటి పోల్ భారత్‌లో నిర్వహించినట్లయితే మోదీ పాపులారిటీ ఎలా తగ్గిపోయిందో తెలుస్తుందని వ్యాఖ్యానించారు. ‘మోదీజీ కేవలం పర్సన్ ఆఫ్ ది ఇయర్ కాదని, పర్సన్ ఆఫ్ ది సెంచరీ అని నేను అనుకుంటున్నాను. మోదీ నిర్దేశించిన శాంతి సౌభాగ్యాలు, అభివృద్ధి, ఉపాధి అజెండాతో ఈ శతాబ్దంలో మిగిలిన 84 ఏళ్లు భారత దేశం, ప్రపంచం అంతా కూడా ఆయన చుట్టూ పరిభ్రమిస్తూ ఉంటుంది’ అని కేంద్ర జలవనరుల శాఖ మంత్రి ఉమాభారతి పార్లమెంటు ఆవరణలో విలేఖరులతో మాట్లాడుతూ అన్నారు. అయితే ఎన్డీఏ ప్రభుత్వ హయాంలో దేశంలో గోధుమపిండి, పప్పు లాంటి నిత్యావసర వస్తువుల ధరలు ఎంతగా పెరిగాయో, నోట్ల రద్దు అనంతరం ప్రజలు ఎలా ఇబ్బందులు పడుతున్నారో బహుశా మోదీకి ఓటేసిన వారికి తెలిసి ఉండదని కాంగ్రెస్ ఎంపీ రాజ్‌బబ్బర్ వ్యంగ్యంగా అన్నారు. సిపిఐ జాతీయ కార్యదర్శి డి రాజా సైతం ఇదే తరహా అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ నోట్ల రద్దుపై ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారన్నారు. ‘టైమ్ పత్రిక ఇచ్చిన సర్ట్ఫికెట్‌తో ప్రధాని మోదీ సంతోషంగా ఉండవచ్చునేమో కానీ, ఈ దేశ ప్రజలు ఇచ్చే సర్ట్ఫికెట్ మాటేమిటి?’ అని రాజా ప్రశ్నించారు. కాగా, నోట్ల రద్దు అనే ఒక్క దెబ్బతో దేశ ప్రజలందరినీ కష్టాల్లోకి నెట్టిన మోదీ సర్వేలో విజయం సాధించడంలో ఆశ్చర్యం ఏమీ లేదని కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ నాయకురాలు రేణుకా చౌదరి వ్యాఖ్యానించారు.