అంతర్జాతీయం

కాశ్మీర్ సమస్యపై మధ్యవర్తిత్వం నెరపండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇస్లామాబాద్, డిసెంబర్ 8: ద్వైపాక్షిక చర్చల విషయంలో భారత్ లెక్కలేనితనంతో వ్యవహరిస్తోందని పాకిస్తాన్ ఆరోపించింది. కాశ్మీర్ సమస్యకు ఫలవంతమైన పరిష్కారాన్ని సూచించే విధంగా చర్చలు జరిపేందుకు భారత్ ఏ మాత్రం చొరవ చూపించటం లేదని పాకిస్తాన్ విదేశాంగ శాఖ ప్రతినిధి నఫీజ్ జకారియా గురువారం ఆరోపించారు. కాశ్మీర్ వివాదం పరిష్కారంలో అంతర్జాతీయ సమాజం కీలకపాత్ర పోషించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ కాశ్మీర్ సమస్య పరిష్కారంపై మధ్యవర్తిత్వం నెరపాలని కోరారు. ఐరాస ప్రధాన కార్యదర్శి, చైనా, ఇరాన్, ట్రంప్ కలిసి భారత్-పాక్ మధ్య కాశ్మీర్ సమస్యకు పరిష్కారం చూపాలని కోరారు. కాశ్మీర్‌లో వాస్తవ పరిస్థితిపై నిజనిర్ధారణకు భారత్ అంగీకరించటం లేదన్నారు. కాశ్మీర్‌లో భారత సైన్యం మానవ హక్కుల ఉల్లంఘనకు పాల్పడుతోందని ఆయన వ్యాఖ్యానించారు.