అంతర్జాతీయం

త్వరగా చేతులు కలపండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాషింగ్టన్, డిసెంబర్ 9: భారత్ బలమైన ఆర్థిక శక్తిగా శరవేగంగా ఎదుగుతోందని, అలాంటి దేశంతో వీలయినంత త్వరగా సన్నిహిత సంబంధాలు నెలకొల్పుకోవడం వల్ల ఇరు దేశాలకు ఎంతో ప్రయోజనం కలుగుతుందని అమెరికాలో ముగ్గు రు రక్షణ నిపుణులు అంటూ, అందువల్ల వీలయినంత త్వరగా భారత్‌తో సంబంధాలను పెంపొందంచుకోవాలని త్వరలో బాద్యతలు చేపట్టనున్న డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వానికి సలసా ఇచ్చారు. బలమైన ఆర్థిక శక్తిగా ఎదుగుతున్న నావసారూప్యత కలిగిన భారత్‌తో వీలయింత త్వరగా సంబంధాలు నెలకొల్పుకోవడం ట్రంప్ ప్రభుత్వానికి తొలి విజయం అవుతుందని సెంటర్ ఫర్ స్ట్రాటజిక్, ఇంటర్నేషనల్ స్టడీస్‌కు చెందిన ముగ్గురు నిపుణులు కాత్లీన్ హెచ్ హిక్స్, డిసి రిచర్డ్ ఎం రోస్సో, జాన్ స్కాస్‌లు అభిప్రాయ పడ్డారు. భారత్, అమెరికాలను సన్నిహితం చేయడానికి వివిధ ప్రభుత్వ శాఖలు, ఏజన్సీలకు చెందిన ఉన్నతాధికారుల కృషి తోడ్పడుతుందని కూడా వారు అభిప్రాయ పడ్డారు. అమెరికా రక్షణ మంత్రి కార్టర్ భారత్ పర్యటనలో పేర్కొన్న విధంగా రెండు దేశాల మధ్య సన్నిహిత సంబంధాల కారణంగా రెండు దఏశాలు కూడా ఎంతో ప్రయోజనం పొందుతాయని ఆ నిపుణులు అభిప్రాయ పడ్డారు. నూతన అధ్యక్షుడిగా ఎన్నికయిన డొనాల్డ్ ట్రంప్ ఆయన జాతీయ భద్రతా బృందం కొత్త ప్రభుత్వ ప్రాధాన్యతలను ఖరారు చేస్తున్నందున అమెరికా-్భరత్ సంబందాలను మరింత బలోపేతం చేసుకోవడం వారి తొలి అజెండాగా ఉండాలని నిపుణులు ఓ సంపాదకీయ వ్యాసంలో పేర్కొన్నారు. ఇదిలా ఉండగా, భారత్ అమెరికకు ప్రధాన రక్షణ భాగస్వామిగా కావడానికి అడ్డంకులన్నీ తొలగిపోయాయి. భారత్‌ను అమెరికాకు ప్రధాన రక్షణ భాగస్వామిగా గుర్తించాలని అవసరమైన చర్యలు తీసుకోవాలని పిలుపునిచ్చే 2017 జాతీయ రక్షణ అధికారాల చట్టం(ఎన్‌డిఏఏ)ను అమెరికా కాంగ్రెస్ ఆమోదించింది. అమెరికా ప్రతినిధుల సభ ఇదివరకే ఆమోదించిన ఈ బిల్లుకు అమెరికా సెనేట్ గురువారం తిరుగులేని మెజారిటీతో ఆమోదించింది. బిల్లుకు అనుకూలంగా 92 ఓట్లు రాగా, వ్యతిరేకంగా 7 ఓట్లు మాత్రమే వచ్చాయి. అమెరికా కాంగ్రెస్‌కు చెందిన ఉభయ సభలు ఈ బిల్లును ఆమోదించినందున ఇప్పుడు ఇది చట్టరూపం దాల్చడం కోసం అధ్యక్షుడు బరాక్ ఒబామా సంతకానికి వెళ్తుంది. భారత్‌తో ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేసుకోవడానికి అవసరమైన నిబంధనలను బిల్లులో చేర్చినందుకు ప్రభుత్వాన్ని అభినందిస్తున్నట్లు అమెరికా సెనేట్‌లో ఇండియా కాకస్ కోచైర్మన్ అయిన మార్క వార్నర్ సెనేట్ బిల్లును ఆమోదించిన తర్వాత ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

చిత్రాలు..ప్రధాని మోదీ, డొనాల్డ్ ట్రంప్