అంతర్జాతీయం

దద్దరిల్లిన టర్కీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇస్తాంబుల్, డిసెంబర్ 11: టర్కీ మరోసారి ఆత్మాహుతి బాంబుదాడులతో దద్దరిల్లిపోయింది. దేశంలోని ముఖ్య నగరాల్లో ఒకటైన ఇస్తాంబుల్‌లో శనివారం రాత్రి సంభవించిన జంట బాంబు పేలుళ్లలో కనీసం 38 మంది మృతిచెందగా, మరో 155 మంది గాయపడ్డారు. పోలీసు అధికారులే లక్ష్యంగా జరిగిన ఈ బాంబు పేలుళ్ల కారణంగా 30 మంది పోలీసులు, మరో ఎనిమిదిమంది పౌరులు మృతి చెందారని టర్కీ ఆంతరంగిక శాఖ మంత్రి సులేమాన్ సోయ్లు ఆదివారం తెల్లవారుజామున విలేఖరులకు చెప్పారు. ఈ దాడికి ప్రతీకారం తీర్చుకుంటామని ఆయన ప్రకటించారు. తొలి పేలుడు ఒక ఫుట్‌బాల్ స్టేడియం వెలుపల, రెండో పేలుడు ఓ పార్కు ఆవరణలో సంభవించాయి. కొత్తగా నిర్మించిన వొడాఫోన్ ఎరీనా స్టేడియంలో ఫుట్‌బాల్ మ్యాచ్ ముగిసిన అనంతరం అభిమానులంతా వెళ్లిపోయాక తొలి పేలుడు సంభవించడంతో పౌరుల మరణాల సంఖ్య తక్కువగా ఉంది. పేలుడు తర్వాత తుపాకీ కాల్పుల శబ్దాలు కూడా వినిపించాయని స్థానికులు చెప్పారు. ఈ ఘటనకు సంబంధించి ఇప్పటికే 10 మంది అనుమానితుల ను అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. మొదటి పేలుడులో కారుబాంబును ఉపయోగించగా, రెండోది ఆత్మాహుతి దాడిగా పోలీసులు అనుమానిస్తున్నారు. కారు పేలిపోయిన చోట పెద్దగొయ్యి పడింది. ‘ఉగ్రవాదం యొక్క క్రూరమైన ముఖాన్ని ఈ రోజు రాత్రి ఇస్తాంబుల్‌లో మనం మరోసారి చూశా’మని టర్కీ అధ్యక్షుడు రెసెప్ తయ్యిప్ ఎర్డోగన్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. స్టేడియం వెనుకవైపునుంచి పెద్దఎత్తున పొగలు ఆకాశంలోకి వ్యాపిస్తుండగా, అంబులెన్స్‌లు క్షతగాత్రులను ఆస్పత్రులకు తరలించడం కనిపించింది. పేలుడు జరిగిన వెంటనే పోలీసులు స్టేడియం ప్రాంతాన్నంతా చుట్టుముట్టి తమ అధీనంలోకి తీసుకున్నారు. పేలుడు ధాటికి పగిలిపోయిన దగ్గర్లోని భవనాల కిటికీల అద్దాలు పేవ్‌మెంట్ నిండా పడి ఉండడం కనిపించింది. ఈ ఏడాది ఇస్తాంబుల్‌లో ఐఎస్‌ఐఎస్ మిలిటెంట్లు, లేదా కుర్దిష్ మిలిటెంట్లు పలు దాడులకు పాల్పడ్డారు. ఈ దాడి కూడా వారి పనే అయి ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. గత జూలై 15లో జరి గిన తిరుగుబాటు యత్నం విఫలమైనప్పటినుంచి దేశంలో ఆత్యయిక పరిస్థితి అమలులో ఉన్న విషయం తెలిసిందే. కాగా, ఇస్తాంబుల్‌లో ఉగ్రవాదుల దాడిని అమెరికా తీవ్రంగా ఖండించింది. ఈ దాడిలో గాయపడిన, మృతి చెం దిన వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నట్లు వైట్‌హౌస్ జాతీయ భద్రతా మం డలి ప్రతినిధి నెడ్ ప్రైస్ ప్రకటనలో పేర్కొన్నారు.

చిత్రం..టర్కీలో కారుబాంబు పేలుడు జరిగిన ప్రాంతాన్ని పరిశీలిస్తున్న అగ్నిమాపక, పోలీసు అధికారులు