అంతర్జాతీయం

కైరో చర్చిలో బాంబు పేలుడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కైరో, డిసెంబర్ 11: ఈజిప్టు రాజధాని కైరోలోని ప్రముఖ కాప్టిక్ క్రిస్టియన్ క్యాథడ్రైల్‌లో ఆదివారం జరిగిన బాంబు పేలుడులో కనీసం 25 మంది మృతి చెందగా, 30 మందికి పైగా గాయపడ్డారు. చనిపోయిన వారిలో ఎక్కువ మంది మహిళలు, పిల్లలే ఉన్నారు. ఆదివారం ప్రార్థనలకోసం పెద్ద సంఖ్యలో జనం చేరినప్పుడు ఈ పేలుడు సంభవించింది. ఇటీవలి కాలంలో మైనారిటీ క్రిస్టియన్లపై ఇస్లామిక్ మిలిటెంట్లు జరిపిన అతిపెద్ద దాడి ఇదే కావడం గమనార్హం. సెంట్రల్ కైరోలోని అబ్బాసియా డిస్ట్రిక్ట్‌లో ఉన్న కాప్టిక్ క్రిస్టియన్ క్యాథడ్రైల్ ఉదయం పది గంటల సమయంలో ప్రార్థనలు జరుగుతున్నప్పుడు ఈ పేలుడు సంభవించినట్లు ఆరోగ్య మంత్రిత్వ శాఖ విడుదల చేసిన ఒక ప్రకటన తెలిపింది. ప్రార్థనలు జరపడానికి పెద్ద సం ఖ్యలో భక్తులు చేరినప్పుడు ఈ బాంబు పేలుడు సంభవించడంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశముంది. ప్రహరీగోడ సమీపంలోని చాపెల్‌లోకి ఉగ్రవాదులు బాంబు విసిరారని, ఫలితంగా కననీసం 25 మంది చనిపోగా, 31 మంది గాయపడినట్లు ఆరోగ్య శాఖ మంత్రి అహ్మద్ ఎమాద్ చెప్పారు. టిఎంటితో చేసిన బాంబును ఉగ్రవాదులు రిమోట్‌తో పేల్చినట్లు ఒక భద్రతా అధికారి చెప్పినట్లు ప్రభుత్వ టీవీ చానెల్ తెలిపింది. గాయపడిన వారిని నగరంలోని దార్ ఎల్ షఎఫా, ఎయిన్ షామ్స్ యూనివర్శిటీ ఆస్పత్రులకు తరలించినట్లు అధికారులు తెలిపారు. ఈ దాడికి బాధ్యత వహిస్తూ ఏ ఉగ్రవాద సంస్థా ఇప్పటివరకు ప్రకటన చేయలేదు. కాప్టిక్ చర్చి ఈజిప్టులోనే అతిపెద్దది. కాగా, ఈజిప్టులో ఈ వారంలో జరిగిన మూడో పేలుడు ఇది. గత శుక్రవారం గిజానగరానికి చెందిన హరామ్ డిస్ట్రిక్ట్‌లో జరిగిన పేలుడులో ఆరుగురు పోలీసులు మృతి చెందగా, మరో ముగ్గురు గాయపడ్డారు. అలాగే కఫర్ ఎల్ షేక్ ఇంటర్నేషనల్ రోడ్డులో జరిగిన మరో పేలుడులో ఒక పోలీసు చనిపోగా, మరో ముగ్గురు గాయపడ్డారు.

చిత్రం..కైరోలో బాంబు పేలుళ్లు జరిగిన కాప్టిక్ ఆర్థొడాక్స్ చర్చిని పరిశీలిస్తున్న ఈజిప్టు అధికారులు