అంతర్జాతీయం

సోమాలియాలో ఆత్మాహుతి దాడి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మొగదిషు, డిసెంబర్ 11: సోమాలియా రాజధాని మొగదిషులో ఆదివారం ఉదయం జరిగిన ఆత్మాహుతి దాడిలో 20 మందికి పైగా చనిపోగా, దాదాపు 50 మంది గాయపడ్డారు. కాగా, ఈ దాడిని తామే జరిపినట్లు అల్‌ఖైదాతో సంబంధాలున్న షబాబ్ ఉగ్రవాద ముఠా ప్రకటించుకుంది. ఇప్పటివరకు తాము వేసిన లెక్కల ప్రకారం ఈ పేలుడులో 20 మందికి పైగా చనిపోయారని, వారిలో ఎక్కువమంది పౌరులేనని సోమాలియా పోలీసు అధికారి ఇబ్రహీం మహమ్మద్ చెప్పారు. మృతులు, క్షతగాత్రులను నగరంలోని వివిధ ఆస్పత్రులకు తీసుకెళ్లినందున మృతుల సంఖ్య పెరగవచ్చని ఆయన చెప్పారు. కాగా, పేలుడు జరిగిన ప్రాంతం చుట్టుపక్కల ఎంతమంది ఉన్నారో స్పష్టంగా తెలియరాలేదు. అయితే తమ సిబ్బంది 48 మంది క్షతగాత్రులను ఆస్పత్రులకు తరలించినట్లు మొగదిషు ‘అమిన్’ అంబులెన్స్ సర్వీస్ డైరెక్టర్ అబ్దిరెహమాన్ అదెమ్ చెప్పారు. దాడి చేసిన ట్రక్కు బాంబర్ ప్రధానంగా పౌర నివాస ప్రాంతానే్న టార్గెట్ చేసుకున్నాడని, పేలుడు జరిగినప్పుడు పోర్టర్లు, చిన్న వ్యాపారులే ఎక్కువ మంది అక్కడ ఉన్నారని నగర అధికారి అబ్ద్ఫితా ఒమర్ హలానే చెప్పారు. రేవుకు దగ్గర్లో ఉన్న మిలిటరీ స్థావరం తమ టార్గెట్ అని, దాడిలో 30 మందికి పైగా చనిపోయినట్లు దాడికి బాధ్యత ప్రకటించుకున్న షబాబ్ గ్రూపు ఒక టెలిగ్రామ్ మెస్సేజ్‌లో తెలిపింది. సోమాలియా ప్రభుత్వాన్ని కూల్చడంకోసం పోరాటం చేస్తున్న ఈ గ్రూపు తరచూ మొగదిషు, దేశంలోని మిగతా ప్రాంతాల్లో మిలిటరీ, పౌరులను లక్ష్యంగా చేసుకుని దాడులు చేస్తోంది. అయితే ఈ రోజు నగరంలోని రేవు ముఖద్వారం సమీపంలో జరిగిన పేలుడు ఇంతకు ముందు జరిగిన పేలుళ్లన్నిటికన్నా తీవ్రమైనదిగా భావిస్తున్నారు. సోమాలియాలో ఈ నెల 28న అధ్యక్ష ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఈ దాడి జరగడం గమనార్హం.

చిత్రం..మొగదిషు సమీపంలో జరిగిన కారుబాంబు దాడి విధ్వంస దృశ్యం