అంతర్జాతీయం

రక్షణ వ్యయంలో భారత్‌కు 4వ స్థానం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లండన్, డిసెంబర్ 12: రక్షణ రంగానికి అత్యధిక బడ్జెట్ కేటాయిస్తున్న మొదటి అయిదు దేశాల్లో భారత్ ఒకటిగా నిలిచింది. సోమవారం విడుదల చేసిన ఓ నివేదిక ప్రకారం భారత్ ఏటా రక్షణ బడ్జెట్‌కు 5వేల కోట్ల డాలర్లను కేటాయిస్తోంది. రక్షణ బడ్జెట్‌కు అత్యధిక నిధులు కేటాయిస్తున్న దేశాల్లో నాలుగో దేశంగా భారత్ ఉందని ఈ నివేదిక పేర్కొంది. ఐహెచ్‌ఎస్ మర్కిత్ అనే సంస్థ ఈ నివేదికను రూపొందించింది. అమెరికా 622 బిలియన్ డాలర్లు సైనిక వ్యయానికి ఖర్చు చేస్తూ అగ్రస్థానంలో నిలిచింది. రెండోస్థానంలో చైనా మిలటరీకోసం 191.7బిలియన్ డాలర్లను ఖర్చు చేస్తోంది. ఇక బ్రిటన్ 53.8 బిలియన్ డాలర్లు, భారత్ 50.7బిలియన్ డాలర్లు, సౌదీ అరేబియా 48.68 బిలియన్ డాలర్లు, రష్యా 48.44 బిలియన్ డాలర్లను రక్షణ రంగం కోసం ఖర్చు చేస్తున్నాయి. రక్షణ రంగానికి భారత్ 2010లో 38బిలియన్ డాలర్లు ఖర్చు చేసింది. ఇది 2020 నాటికి 64బిలియన్ డాలర్లకు చేరుకోవచ్చని నివేదిక అంచనా వేసింది. సైనిక సంపత్తిని ఆధునీకరించటానికి 2017లో కొత్త పరికరాలను సమకూర్చుకునే అవకాశం ఉందని పేర్కొంది. రక్షణ పరికరాల వ్యాపారులకు భారత్ ముఖ్యమైన మార్కెట్ కాబోతోందని వివరించింది.