అంతర్జాతీయం

శంషాబాద్‌లో అత్యవసరంగా దిగిన ఒమన్ విమానం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 12: హైదరాబాద్‌లోని రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఒమన్ ఎయిర్‌వేస్ విమానం సోమవారం అత్యవసర ల్యాండ్ అయింది. మస్కట్ నుంచి చెన్నై వెళ్లాల్సిన ఈ విమానం చెన్నైలో వర్షాల కారణంగా వాతావరణం అనుకూలించకపోవడంతో శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లోనే అత్యవసరంగా ల్యాండయింది. మరోవైపు కౌలాలంపూర్ వెళ్లాల్సిన విమానంలో సాంకేతిక లోపం తలెత్తడంతో దానిని కూడా శంషాబాద్‌లోనే అత్యవసరంగా ల్యాండ్ చేశారు. విమానాల అత్యవసర ల్యాండింగ్‌తో ప్రయాణికులు ఇబ్బందులకు గురికాకుండా చర్యలు చేపట్టినట్టు అధికారులు వెల్లడించారు.