అంతర్జాతీయం

అమెరికా విదేశాంగ మంత్రిగా టిల్లెర్‌సన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాషింగ్టన్, డిసెంబర్ 13: ఎక్సొన్ మొబైల్ సిఇవో రెక్స్ టిల్లెర్‌సన్ అమెరికా నూతన విదేశాంగ మంత్రిగా కానున్నారు. అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ ఈ మేరకు ఒక ప్రకటన చేస్తూ రెక్స్ విదేశాంగ మంత్రికి కావల్సిన అన్ని అర్హతలూ ఉన్నాయని ప్రకటించారు. సమర్థత, ప్రాంతీయ రాజకీయాల్లో అపారమైన అనుభవం పరిగణనలోకి తీసుకునే ఆయనను ఎంపిక చేసినట్టు ట్రంప్ తెలిపారు. ట్రంప్ లాగే 64 ఏళ్ల టిల్లెర్‌సన్‌కు విదేశాంగ పరిజ్ఞానం అంతగాలేదు. అయితే అనేక మంది విదేశీ నేతలతో ఆయనకు మంచి సంబంధాలున్నాయి. ప్రపంచ ఆయిల్ కంపెనీల యజమానులతోనూ టిల్లెర్‌సన్‌కు సంబంధాలున్నాయి. 2011లో ఎక్సొన్ కంపెనీ రష్యా ఆయిల్ దిగ్గజం రొసెనె్ఫట్‌తో ఒప్పందం విషయంలోనూ ఆయన కీలకపాత్ర పోషించారు. రష్యా ప్రభుత్వ షేర్‌హోల్డర్స్‌లో రొసెనె్ఫట్ సంస్థే పెద్దది. ఎక్సొన్ ఒప్పంద కార్యక్రమానికి రష్యా అధ్యక్షుడు పుతిన్ హాజరవడం గమనార్హం.