అంతర్జాతీయం

ఐరాసను మారుస్తా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూయార్క్, డిసెంబర్ 13: ప్రపంచ సమస్యలు, సవాళ్లకు దీటుగా ఐక్యరాజ్య సమితిని తీర్చిదిద్దేందుకు ప్రయత్నిస్తానని కొత్త సెక్రటరీ జనరల్ యాంటోనియో గట్టర్స్ స్పష్టం చేశారు. ఐరాస ప్రత్యేక సమావేశంలో తొమ్మిదో సెక్రటరీ జనరల్‌గా ప్రమాణం చేసిన గట్టర్స్ ‘ప్రపంచ వ్యాప్తంగా ఎడతెగని సమస్యలుగా కొనసాగుతున్న వివాదాలను పరిష్కరించేందుకు వ్యక్తిగతంగా కృషి చేస్తా’నని హామీ ఇచ్చారు. గత ఏడు దశాబ్దాలుగా ఎలాంటి మార్పులు లేకుండా కొనసాగుతున్న ఐరాసను వాస్తవానుగుణంగా తీర్చిదిద్దాల్సిన అవసరం ఎంతో ఉందని పిలుపునిచ్చారు. ప్రపంచ దేశాలను పట్టిపీడిస్తున్న సమస్యలన్నింటికీ పరిష్కారం దక్కాలంటే అందుకు అనుగుణంగా ఐరాస నిగ్గుదేలాలన్నారు. మాటల కంటే చేతలకు ప్రాధాన్యత ఇచ్చినప్పుడే ఐరాస కీర్తి ప్రతిష్టలు ఇనుమడిస్తాయని, ప్రపంచ సమస్యలూ పరిష్కారం అవుతాయని గట్టర్స్ అన్నారు. ప్రపంచ వ్యాప్తంగా అసమానతలు, ఇతర జటిల సమస్యలు తలెత్తడానికి ప్రపంచీకరణ, సాంకేతిక ప్రగతి కొంత మేర కారణమైందని పేర్కొన్న ఆయన దీని వల్ల అనేక దేశాల్లో ప్రజలకు, ప్రభుత్వాలకు మధ్య సంబంధాలే తెగిపోయే పరిస్థితి ఏర్పడిందన్నారు. ఇంకొన్ని దేశాల్లో అశాంతి, సామాజిక అనిశ్చితి,హింస, సంఘర్షణలు తీవ్రమయ్యాయన్నారు. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకుని ఐరాసను ముందుకు నడిపించాల్సిన అవసరం ఎంతో ఉందని.. అందుకు సంస్కరణలే ఏకైక మార్గమని తెలిపారు.