అంతర్జాతీయం

డ్రోన్ సమస్య విజయవంతంగా పరిష్కారమవుతుంది: చైనా ఆర్మీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బీజింగ్, డిసెంబర్ 17: దక్షిణ చైనా సముద్రంలో పిఎల్‌ఎ (పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ) యుద్ధనౌక స్వాధీనం చేసుకున్న తమ అండర్ వాటర్ డ్రోన్‌ను తిరిగి ఇవ్వాల్సిందిగా అమెరికా విజ్ఞప్తి చేసిందని చైనా సైనిక దళం శనివారం ధ్రువీకరించింది. ఈ సమస్య విజయవంతంగా పరిష్కారమవుతుందని చైనా సైనిక దళం పేర్కొంది. చైనా యుద్ధనౌక దక్షిణ చైనా సముద్రంలో తనిఖీలు నిర్వహిస్తూ అమెరికాకు చెందిన అండర్ వాటర్ డ్రోన్‌ను స్వాధీనం చేసుకుందని, ఆ డ్రోన్‌ను తమకు తిరిగి ఇవ్వాల్సిందిగా అమెరికా విజ్ఞప్తి చేసినట్లు చైనా సైనికాధికారి ఒకరు ధ్రువీకరించారని, ఈ సమస్య విజయవంతంగా పరిష్కారమవుతుందని చైనా భావిస్తున్నట్లు ఆ అధికారి తెలిపారని చైనా ప్రభుత్వ వార్తా సంస్థ ‘గ్లోబల్ టైమ్స్’ వెబ్ ఎడిషన్ పేర్కొంది. అయితే ఈ ఘటనకు సంబంధించి చైనా ప్రభుత్వం నుంచి అధికారికంగా ఎటువంటి ప్రకటనా వెలువడలేదు.