అంతర్జాతీయం

సింధూ జలాల ఒప్పందంలో ఎలాంటి మార్పులనూ అంగీకరించం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇస్లామాబాద్, డిసెంబర్ 17: సింధూ నదీ జలాల ఒప్పందంలో ఎలాంటి మార్పులు చేయడానికి తమ దేశం అంగీకరించదని పాకిస్తాన్ స్పష్టం చేసింది. 56 ఏళ్లనాటి ఈ ఒప్పందం అమలులో ఏవయినా ఇబ్బందులు తలెత్తితే వాటిని ద్వైపాక్షికంగానే పరిష్కరించుకోవాలని భారత్ గట్టిగా వాదిస్తూ ఉన్న నేపథ్యంలో పాకిస్తాన్ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. సింధూ జలాల ఒప్పందంలోని నిబంధనల్లో ఎలాంటి మార్పులు, సవరణలు చేయడానికి పాకిస్తాన్ అంగీకరించదు. ఒప్పందంలో పేర్కొన్న సూత్రాల ఆధారంగా మా వైఖరి ఉంది.. ఈ ఒప్పందాన్ని తు.చ తప్పకుండా అమలు చేయాలి’ అని పాక్ ప్రధానమంత్రికి ప్రత్యేక సహాయకుడు తారిఖ్ ఫతేమి ‘డాన్ న్యూస్’కు చెప్పారు. కిషన్ గంగ లాంటి ప్రాజెక్టులపై పాకిస్తాన్ లేవనెత్తిన సాంకేతికపరమైన అభ్యంతరాలను ఇరు దేశాలకు చెందిన సాంకేతిక నిపుణులతో ఎందుకు పరిష్కరించుకోకూడదో తనకు అర్థం కావడం లేదని విదేశాంగ శాఖ ప్రతినిధి వికాస్ స్వరూప్ గురువారంనాడు వ్యాఖ్యానించిన నేపథ్యంలో తారిఖ్ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. అంతేకాదు ఈ సంప్రదింపులకు తగినంత సమయం ఇవ్వాలని కూడా భారత్ గట్టిగా భావిస్తోందని వికాస్ స్వరూప్ అన్నారు. అయితే ఎక్కువ సమయం ఇవ్వాలన్న భారత్ అభ్యర్థన పాకిస్తాన్‌కు ఆందోళన కలిగిస్తోందని ‘డాన్’ పేర్కొంది. భారత్ గతంలో కూడా ఇదే వ్యూహాన్ని ఉపయోగించిందని, వివాదం కొనసాగుతుండగానే ప్రాజెక్టు పూర్తి చేసి, ఆ తర్వాత ప్రాజెక్టు పూర్తయిందని, అందువల్ల దాన్ని మార్పు చేయలేమని వాదించిందని ఆ పత్రిక పేర్కొంది. భారత్ చీనాబ్ నదిపై కిషన్ గంగ, రాటిల్ జలవిద్యుత్ ప్రాజెక్టులను నిర్మిస్తోంది. అయితే ఈ ప్రాజెక్టులు సింధూ జలాల ఒప్పందానికి వ్యతిరేకమని పాకిస్తాన్ వాదిస్తోంది. అంతేకాదు, అంతర్జాతీయ న్యాయస్థానం మధ్యవర్తిత్వం ద్వారా సమస్యను పరిష్కరించుకోవాలని ఆ దేశం భావిస్తోంది.