అంతర్జాతీయం

ఆ డ్రోన్‌ను మీరే అట్టిపెట్టుకోండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాషింగ్టన్, డిసెంబర్ 18: దక్షిణ చైనా సముద్రంలో తమ అండర్ వాటర్ డ్రోన్‌ను స్వాధీనం చేసుకున్న చైనాపై అమెరికా తదుపరి అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆదివారం మరోసారి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ‘తగిన రీతిలో’ ఈ డ్రోన్‌ను అప్పగించేందుకు చైనా అంగీకరించడంతో ఆ డ్రోన్‌ను వారే అట్టిపెట్టుకోవాలని ట్రంప్ అన్నారు. ‘చైనా దొంగిలించిన ఆ డ్రోన్ మాకు అక్కర్లేదు. దానిని చైనాయే అట్టిపెట్టుకోవాలని అమెరికా స్పష్టం చేయాలి’ అని ట్విట్టర్‌లో ట్రంప్ పేర్కొన్నారు. ఈ డ్రోన్‌ను తిరిగి తీసుకునేందుకు చైనాతో అవగాహన కుదర్చుకున్నామని అమెరికా రక్షణ శాఖ ప్రధాన కార్యాలయం ‘పెంటగాన్’ ప్రకటించిన కొద్ది గంటలకే ట్రంప్ ఈ ట్వీట్ చేశారు. దక్షిణ చైనా సముద్రంలో సర్వే నిర్వహిస్తున్న అమెరికా నావికాదళ నౌక నుంచి ఈ నెల 15వ తేదీన చైనా అక్రమంగా ఆ డ్రోన్‌ను స్వాధీనం చేసుకుందని పెంటగాన్ ఆరోపించింది. దీనిపై అమెరికా దౌత్యపరమైన ఫిర్యాదును దాఖలుచేసి, ఆ డ్రోన్‌ను తిరిగి తమకు అప్పగించాలని డిమాండ్ చేసింది. అమెరికా, చైనా మధ్య దశాబ్దాల తరబడి కొనసాగుతున్న తీవ్రమైన సైనిక ఘర్షణల్లో ఈ ఘటన ఒకటి. ఈ డ్రోన్‌ను తాము స్వాధీనం చేసుకోవడం పట్ల గగ్గోలు పెడుతున్న అమెరికాపై చైనా శనివారం తీవ్రస్థాయిలో ధ్వజమెత్తడంతో పాటు ‘తగిన రీతి’లో ఈ డ్రోన్‌ను తిరిగి అమెరికాకు అప్పగిస్తామని పేర్కొంది.

చిత్రం..మొబైల్‌లో విజయోత్సవ ర్యాలీలో మాట్లాడుతున్న ట్రంప్