అంతర్జాతీయం

సంక్షోభంలో వెనిజులా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కరాకస్, డిసెంబర్ 18: గత రెండు రోజులుగా దేశంలో చెలరేగుతున్న లూటీలు, దోపిడీలు, విధ్వంసాల నేపథ్యంలో పెద్ద నోటు రద్దు నిర్ణయాన్ని వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మదురో వాయిదా వేసుకున్నారు. కొత్త నోట్లు లభించక, ఉన్న నోట్లు చెల్లని స్థితిలో వెనిజులా ప్రజలు వీధికక్కారు. నగదు సంక్షోభం కారణంగా దేశ వ్యాప్తంగా తలెత్తిన అనిశ్చితితో నికోలస్ వెనక్కి తగ్గక తప్పలేదు. పది రోజుల్లో తమ వద్ద ఉన్న 100 బొలివర్ విలువైన నోటును సెంట్రల్ బ్యాంకులో మార్చుకోవచ్చునని ప్రభుత్వం గడువు ఇచ్చినప్పటికీ దీని రద్దు అనంతర పరిస్థితులు, పరిణామాలు దేశ ప్రజల్ని కకావికలు చేశాయి. ప్రజల నుంచి వస్తున్న తిరుగుబాటును దృష్టిలో పెట్టుకుని నగదు రద్దు నిర్ణయాన్ని రెండు వారాల పాటు వాయిదా వేస్తున్నట్టు నికోలస్ ప్రకటించారు. జనవరి రెండు వరకూ పాత నోటును ప్రజలు తమ అవసరాలు తీర్చుకునేందుకు వినియోగించుకోవచ్చునని చెప్పారు. వెనిజులాలో ఇదే అతిపెద్ద నోటు అయినప్పటికీ బ్లాక్ మార్కెట్ కరెన్సీలో దీని విలువ కేవలం నాలుగు అమెరికా సెంట్లు. కొత్త నోట్లను అందుబాటులోకి తేకుండా ఉన్న నోటును ఆకస్మికంగా రద్దు చేయడం వల్ల ఒక్కసారిగా అరాచక పరిస్థితులు ఏర్పడ్డాయి. ఫలితంగా దుకాణాల లూటీలు, ప్రభుత్వ వ్యతిరేక ప్రదర్శనలు తీవ్రమయ్యాయి. తాజా పరిస్థితిపై అధ్యక్ష భవనం నుంచి మాట్లాడిన అధ్యక్షుడు మదురో ప్రస్తుత అల్లర్లకు ప్రత్యర్థులు పన్నిన కుట్రే కారణమని ధ్వజమెత్తారు. 500, 2000, 20,000 నోట్లను సకాలంలో అన్ని ప్రాంతాలకు చేరవేసేందుకు తాము మూడు విమానాలను ఏర్పాటు చేసినప్పటికీ అవి నిర్ణీత కాల వ్యవధిలో గమ్యాలను చేరకుండా అడ్డుకున్నారని అన్నారు. నగదుతో వెనిజులా రావాల్సిన ఓ విమానాన్ని మరో దేశానికి మళ్లించేశారని కూడా మదురో ఆరోపించారు. ఈ పనంతా ఇతర దేశాల్లో ఉన్న తన ప్రత్యర్థులే చేస్తున్నారని చెప్పిన ఆయన వారి పేర్లను వెల్లడించలేదు. ఇంకో విమానానికి అసలు అనుమతే లభించలేదని చెప్పారు.
గత రెండు రోజులుగా నగదు కోసం పడరాని పాట్లు పడుతున్న వెనిజులా పౌరుల్లో 40శాతం మందికి బ్యాంకు ఖాతాలే లేవు. ఆన్‌లైన్ లావాదేవీలు చేసుకునే పరిస్ధితి లేకపోవడంతో పస్తులుండాల్సిన స్థితికి చేరుకున్నారు.

చిత్రం..నోటు రద్దును నిరసిస్తూ ఆందోళనకు దిగిన ప్రజలను అదుపు చేస్తున్న వెనిజులా పోలీసులు