అంతర్జాతీయం

ట్రంప్‌కు ‘ఎలక్టోరల్’ మద్దతు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాషింగ్టన్, డిసెంబర్ 20: అమెరికా 45వ అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ఎన్నిక ధ్రువీకృతమైంది. అత్యంత కీలకమైన ఎలక్టోరల్ కాలేజీ ఓట్లను ఆయన సంపాదించుగోలిగారు. రిపబ్లికన్ సభ్యులను రెచ్చగొట్టి ట్రంప్‌కు వ్యతిరేకంగా ఓటు వేసేలా చేసేందుకు ప్రత్యర్థులు చేసిన ప్రయత్నాలేవీ ఫలించలేదు. ముఖ్యంగా అనూహ్య రీతిలో గెలిచిన ట్రంప్ విజయం వెనుక రష్యా హస్తం ఉందని, రష్యా హ్యాకర్ల కారణంగానే ఆయనకు ఓట్లు పడ్డాయంటూ విమర్శలు వెల్లువెత్తాయి. అందరి అంచనాలూ తలకిందులు చేస్తూ ఏకంగా 270 ఓట్లను గెలుచుకున్న ట్రంప్ యావత్ ప్రపంచాన్ని విస్మయానికి గురిచేశారు. ఆయన ఎన్నికపై అనేక రకాలుగా ఆరోపణలు వెల్లువెత్తాయి. ముఖ్యంగా డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థి హిల్లరీదే విజయమనుకుంటున్న తరుణంలో ట్రంప్ ఘన విజయం సాధించడం ఎవరికీ అంతుబట్టలేదు. ఎలక్టోరల్ కాలేజీ సభ్యులు ట్రంప్‌కు వ్యతిరేకంగా ఓటు వేస్తారని ప్రత్యర్థులు భావించారు. అక్కడ కూడా ట్రంప్‌దే పైచేయి అయింది. అధ్యక్ష ఎన్నికలు జరిగిన దాదాపు ఆరువారాల తర్వాత ఎలక్టోరల్ కాలేజీ మద్దతునూ ట్రంప్ చూరగొనడంతో ఈ తతంగానికి తెరపడినట్టయింది. ఎలక్టోరల్ కాలేజీలో ట్రంప్‌కు 305 ఓట్లు, హిల్లరీకి 227 ఓట్లు వచ్చాయి. ఏడుగురు ఓటర్లు ఇతరులకు మద్దతు పలికారు. ఫలితంగా ట్రంప్‌కు రెండు ఓట్లు, హిల్లరీకి నాలుగు ఓట్లు తగ్గాయి. జనాదరణలో ట్రంప్ కంటే హిల్లరీదే పైచేయి అన్న విషయం తెలిసిందే. పాపులర్ ఓట్లలో హిల్లరీకి 30లక్షల ఓట్లు అధికంగా వచ్చాయి. అయినా కొన్ని రాష్ట్రాల్లో ఎలాంటి ఫలితం కనబరచక పోవడం వల్ల ఓడిపోయారు. ఎలక్టోరల్ కాలేజీ మద్దతు చూరగొన్న అనంతరం మాట్లాడిన ట్రంప్ ‘ఇది అమెరికా ప్రజాస్వామ్య చరిత్రలో అనూహ్యమైన, చారిత్రక పరిణామం. తమ తదుపరి అధ్యక్షుడిగా తిరుగులేని మెజార్టీతో నన్ను ఎన్నుకున్నందుకు అమెరికన్లకు కృతజ్ఞతలు చెబుతున్నాను’అని ట్రంప్ అన్నారు.