అంతర్జాతీయం

అణ్వస్త్ర నిరోధానికి తూట్లు?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాషింగ్టన్, డిసెంబర్ 23: అణ్వస్త్రాలకు సంబంధించి అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికయిన డొనాల్డ్ ట్రంప్ చేసిన ట్వీట్ ఈ విషయంలో అమెరికా విధానం తీవ్రంగా మారబోతోందన్న సంకేతాలను సూచిస్తోంది. అణ్వస్త్రాలను తగ్గిస్తూ చివరకు నిర్మూలించాలన్న ప్రస్తుత అధ్యక్షుడు ఒబామా పాలనా యంత్రాంగం అనుసరించిన వైఖరికి వ్యతిరేకంగా ట్రంప్ వైఖరి ఉన్నట్లు ఈ ట్వీట్ వెల్లడిస్తోంది. ‘అమెరికా తన అణు సామర్థ్యాన్ని బాగా పటిష్ఠం చేసుకోవాలి. ప్రపంచం తన అణ్వస్త్ర పాటవాన్ని గుర్తించేంత వరకు ఇది సాగాలి’ అని ట్రంప్ సామాజిక మాధ్యమం ట్విట్టర్‌లో గురువారం పోస్ట్ చేసిన ఒక సందేశంలో పేర్కొన్నారు. అమెరికా జాతీయ భద్రతా విధానంలో సంతరించుకోనున్న భారీ మార్పును ట్రంప్ ట్విట్టర్ సందేశం సూచిస్తోందని ‘ద వాషింగ్టన్ పోస్ట్’ పత్రిక విశే్లషించింది. మరోవైపు, అమెరికాలో పటిష్ఠంగా ఉన్న అణ్వస్త్ర వ్యాప్తి నిరోధక వర్గం ట్రంప్ ప్రకటనపై ఆందోళన వ్యక్తం చేసింది. ‘అధ్యక్షుడిగా ఎన్నికయిన నేత అమెరికాలో విధానపరమైన భారీ మార్పును ప్రకటించడానికి కేవలం 140 అక్షరాలను ఉపయోగించుకోవడం ప్రమాదకరం. భూగ్రహంపై ఉన్న ప్రతి ఒక్క వ్యక్తిపై ప్రభావం చూపగల సంక్లిష్టమైన అంశం అణ్వస్త్ర విధానం’ అని 18ఏళ్ల పాటు అమెరికా కాంగ్రెస్ సభ్యుడిగా పనిచేసిన ఆయుధాల నియంత్రణ, అణ్వస్త్ర వ్యాప్తి నిరోధక కేంద్రం ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ జాన్ టిర్నే అన్నారు. ప్రచ్ఛన్న యుద్ధం ముగిసినందున అమెరికా రక్షణ విధానంలో అణ్వస్త్రాలపై విశ్వాసాన్ని తగ్గించుకునేలా, పెద్ద మొత్తంలో ఉన్న అణ్వస్త్రాలను తగ్గించుకునేలా ద్వైపాక్షిక ఏకాభిప్రాయం ఇప్పటి వరకు ఉందని ఆయన పేర్కొన్నారు.