అంతర్జాతీయం

భారత్ ప్రధాన రక్షణ భాగస్వామి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాషింగ్టన్, డిసెంబర్ 24: అమెరికా వచ్చే సంవత్సరానికి రూపొందించిన రక్షణ బడ్జెట్ భారత్‌తో భద్రతా సహకారాన్ని మరింత పెంపొందించుకోవడానికి వీలు కల్పిస్తోంది. 618 బిలియన్ డాలర్లతో కూడిన అమెరికా రక్షణ బడ్జెట్ బిల్లుపై ఆ దేశాధ్యక్షుడు బరాక్ ఒబామా శుక్రవారం సంతకం చేశారు. ఈ జాతీయ రక్షణ ధ్రువీకరణ చట్టం (ఎన్‌డిఎఎ) 2017లో పాకిస్తాన్‌కు చేసే ఆర్థిక సాయంపై దాదాపు సగం నిధులకు అమెరికా నాలుగు షరతులు విధించింది. పాకిస్తాన్ తన గడ్డపై హక్కాని నెట్‌వర్క్‌ను అణచివేయడానికి నిరూపించగలిగిన చర్యలు తీసుకోవాలనేది ఇందులో ప్రధానమైన షరతు. భారత్‌ను అమెరికాకు ప్రధాన రక్షణ భాగస్వామి (మేజర్ డిఫెన్స్ పార్టనర్- ఎండిఎఫ్)గా గుర్తించటానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని అమెరికా రక్షణ, విదేశాంగ మంత్రులను ఎన్‌డిఎఎ ఆదేశించింది. సెనేట్ ఆర్మ్‌డ్ సర్వీసెస్ కమిటీ చైర్మన్ విడుదల చేసిన ఈ బిల్లులో ప్రధానమైన అంశం అమెరికా, భారత్‌ల మధ్య భద్రతా సహకారాన్ని పెంపొందించడం అని సెనేటర్ జాన్ మెక్‌కెయిన్ పేర్కొన్నారు. అమెరికా- భారత్ రక్షణ సంబంధాల చట్రాన్ని విజయవంతం చేయడానికి రక్షణ పరికరాల సేకరణలో అనుభవం గల కార్యనిర్వాహక విభాగంలోని ఒక వ్యక్తిని ప్రత్యేకంగా నియమించాలని కూడా పాలనా యంత్రాంగాన్ని ఈ చట్టం ఆదేశించింది. అమెరికా- భారత్ రక్షణ వాణిజ్యం, భద్రతా సహకారం, సహఉత్పత్తి, సహఅభివృద్ధి అవకాశాలలో ప్రతిబంధకాలుగా ఉన్న అంశాలను పరిష్కరించటానికి కూడా ఈ వ్యక్తి సహాయపడతాడని పేర్కొంది.
ఎన్‌డిఎఎలో ఇతర అంశాలతో పాటు 1.2 బిలియన్ డాలర్ల కౌంటర్-ఐఎస్‌ఐఎల్ నిధిని ఏర్పాటు చేశారు. అమెరికా పాకిస్తాన్‌కు కూటమి మద్దతు నిధి (కొయలీషన్ సపోర్ట్ ఫండ్- సిఎస్‌ఎఫ్) కింద ఇచ్చే 900 మిలియన్ డాలర్లలో 400 మిలియన్ డాలర్లను పొందడానికి నాలుగు షరతులు విధించింది. పాకిస్తాన్‌లోని హక్కాని నెట్‌వర్క్ స్థావరాలను ధ్వంసం చేయడానికి, ఆ నెట్‌వర్క్ ఉగ్రవాదుల కదలికలను అణచివేయడానికి పాకిస్తాన్ స్థిరమైన, నిరంతర సైనిక ఆపరేషన్లను నిర్వహిస్తున్నట్టు అమెరికా రక్షణ మంత్రి ధ్రువీకరించి కాంగ్రెస్‌కు పంపించవలసి ఉంటుంది. పాకిస్తాన్ తన గడ్డను హక్కాని నెట్‌వర్క్ స్వర్గ్ధామంగా వినియోగించుకోవడాన్ని నిరోధించడంలో తన నిబద్ధతను చాటుకునేందుకు నిరూపించగలిగిన స్థాయిలో చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. ఈ సంవత్సరం మొదట్లో అమెరికా రక్షణ మంత్రి అస్టోన్ కార్టర్ ఇలాంటి ధ్రువపత్రం (సర్ట్ఫికెట్) ఇచ్చేందుకు నిరాకరించారు. దీంతో పాకిస్తాన్ సిఎస్‌ఎఫ్ కింద తనకు రావలసిన 300 మిలియన్ డాలర్లను పొందలేక పోయింది.