అంతర్జాతీయం

కూలిన రష్యా విమానం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మాస్కో, డిసెంబర్ 25: రష్యాకు చెందిన మిలిటరీ విమానం ఒకటి ఆదివారం నల్లసముద్రంలో కూలిపోయింది. విమానంలో ఉన్న మొత్తం 92 మంది ప్రయాణికులు చనిపోయి ఉంటారని భావిస్తున్నారు. సిరియాలోని లటాకియా ప్రావిన్స్ వెళ్లేందుకు సోచీ విమానాశ్రయంనుంచి బయలుదేరిన టియు-154 విమానం టేకాఫ్ అయిన 20 నిమిషాలకే రాడార్‌తో సంబంధాలు తెగిపోయాయి. విమానంకోసం గాలింపు చేపట్టిన బృందాలకు నల్లసముద్రంలో 1.5 కిలోమీటర్ల దూరంలో 50నుంచి 70 మీటర్ల లోతులో విమాన శకలాలు కనిపించాయి. స్థానిక కాలమానం ప్రకారం ఉదయం 5.25 గంటలకు సోచీనుంచి టేకాఫ్ అయిన 2 నిమిషాలకే రాడార్‌తో విమానానికి సంబంధాలు తెగిపోయాయని రష్యా రక్షణ శాఖ ప్రతినిధి ఇగోర్ కొనషెంకోవ్ రష్యా వార్తాసంస్థలకు తెలిపారు. విమానంలో ఎవరూ ప్రాణాలతో మిగిలి ఉన్నట్లు కనిపించడం లేదని, సోచీకి ఆరు కిలోమీటర్ల దూరంలో సముద్రం తీరంలో నాలుగు మృత దేహాలను కనుగొన్నారని మంత్రిత్వ శాఖ తెలిపింది. విమానంలో అలెగ్జాండ్రోవ్ మిలిటరీ బ్యాండ్ బృందం సభ్యు లు, ప్రభుత్వ టీవీ చానళ్లకు చెందిన 9 మంది రిపోర్టర్లతో కలిపి 84 మంది ప్రయాణికులు, 8మంది విమాన సిబ్బంది మొత్తం 92 మంది ఉన్నట్లు అధికారులు తెలిపారు. పశ్చిమ సిరియాలోని రష్యాకు చెందిన మీమిమ్ ఎయిర్‌బేస్‌లో జరిగే నూతన సంవత్సర వేడుకల్లో పాల్గొనేందుకు 64 మంది సభ్యులున్న ఈ బ్యాండ్ బృందం వెళ్తోంది. రష్యాలోని మాస్కోనుంచి బయలుదేరిన విమానం సోచీలో ఇంధనం నింపుకొన్న తర్వాత సిరియాకు బయలుదేరింది. అంతర్యుద్ధంతో అతలాకుతలమవుతున్న సిరియాలో తన మిత్రుడైన అధ్యక్షుడు బషర్ అల్ అస్సాద్‌కు మద్దతుగా రష్యా అక్కడి తిరుగుబాటుదారులపై వైమానిక దాడులు సైతం జరుపుతున్న విషయం తెలిసిందే. ఆ దాడుల్లో ఈ విమానం కూడా పాల్గొంటోంది. కాగా, 1983నుంచి ఈ విమానం సేవలు అందిస్తోందని, ఇప్పటివరకు 7 వేల గంటల మేర ప్రయాణం సాగించిందని రక్షణ శాఖ ప్రతినిధి తెలిపారు.

నల్ల సముద్రంలో శకలాలు వెలికితీస్తున్న దృశ్యం. (ఇన్‌సెట్) టియు-154 విమానం (ఫైల్)