అంతర్జాతీయం

రష్యాపై ఆంక్షలు, 37మంది ఏజెంట్ల బహిష్కరణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాషింగ్టన్/మాస్కో, డిసెంబర్ 30: అధ్యక్ష ఎన్నికల సమయంలో హ్యాకింగ్‌కు పాల్పడ్డారన్న అభియోగాల నేపథ్యంలో రష్యాపై అమెరికా ఆంక్షలు విధించింది. అలాగే 35మంది రష్యా ఏజెంట్లను బహిష్కరించింది. దీనికి ప్రతిగా అమెరికా దౌత్యవేత్తలను బహిష్కరించాలని రష్యా భావించినా చివరి క్షణంలో తన నిర్ణయం మార్చుకుంది. ఆమెరికా కొత్త అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధానాలను పరిశీలించిన తర్వాత నిర్ణయం తీసుకుంటామని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తెలిపారు. అధ్యక్ష ఎన్నికల సమయంలో రష్యా వ్యవహరించిన తీరు అమెరికన్లకు తీవ్ర ఆందోళన కలిగించిందని అధ్యక్షుడు బరాక్ ఒబామా ఓ ప్రకటనలో స్పష్టం చేశారు. హ్యాకింగ్ విషయంలో రష్యాను అనేక సార్లు హెచ్చరించిన తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. అంతర్జాతీయ ప్రవర్తనా ప్రమాణాలకు విరుద్ధంగా రష్యా వ్యవహరించిందని అన్నారు.